Sreeleela: శ్రీలీల చేస్తున్న సినిమాల లిస్ట్ పెద్దదే.. 2025 నాటికి ఎన్ని కోట్లను తన ఖాతాలో వేసుకుంటుందో తెలిస్తే..

Sreeleela: శ్రీలీల చేస్తున్న సినిమాల లిస్ట్ పెద్దదే.. 2025 నాటికి ఎన్ని కోట్లను తన ఖాతాలో వేసుకుంటుందో తెలిస్తే..

ఈ పిల్ల అన్నం తిని బతికిందో.. అందం తిని బతికిందో కానీ ఇప్పుడు శ్రీలీల పేరు మారుమోగుతోంది. అమ్మడికి హిట్.. ఫట్‌లతో సంబంధమే లేదు. అందం కావాల్సినంత ఉండటంతో పాటు డ్యాన్స్ ఇరగదీస్తుంది. ఇక యూత్ అయితే అమ్మడికి బీభత్సంగా కనెక్ట్ అయిపోయారు. దీంతో దర్శకనిర్మాతలు అమ్మడి కాల్షీట్ల కోసం ఎగబడుతున్నారు. ఇప్పుడు అమ్మడి గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం శ్రీలీల ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్‌ అందుకుంటోందట. ఇక ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ బ్యూటీ 2024 నాటికి రెమ్యూనరేషన్ పరంగా దాదాపు రూ.16 కోట్లు ఆర్జించనుందట. లెక్కలతో సహా నెటిజన్లు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం ఒక్క సినిమాకు మాత్రమే శ్రీలీల రూ.70 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటోందట. అది మినహా మిగిలిన సినిమాలన్నింటికీ రూ.2 కోట్ల చొప్పున పారితోషికం అందుకుంటోందట.

Sreeleela: శ్రీలీల చేస్తున్న సినిమాల లిస్ట్ పెద్దదే.. 2025 నాటికి ఎన్ని కోట్లను తన ఖాతాలో వేసుకుంటుందో తెలిస్తే..

ప్రస్తుతం శ్రీలీల లిస్ట్‌లో గుంటూరు కారం సహా, ఉస్తాద్ భగత్‌సింగ్, బాలకృష్ణ మూవీ, నితిన్‌తో మూవీ, విజయ్ దేవరకొండ, రవితేజ, పంజా వైష్ణవ్ సినిమాలు ఉన్నాయి. వీటిన్నింటిలోనూ అమ్మడు నటిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంలో కూడా అమ్మడు నటించే అవకాశం ఉందట. ఇప్పటికే చర్చలు నడుస్తున్నాయని సమాచారం. మెగాస్టార్ మూవీని పక్కనబెడితే ప్రస్తుతం అమ్మడు చేస్తున్న సినిమాలన్నీ 2024 నాటికి పూర్తవుతాయట. అంటే 2025 నాటికి ఈ ముద్దుగుమ్మ ఎంత లేదన్నా దాదాపు రూ.20 కోట్లను ఆర్జిస్తుందట. ఇది కేవలం టాలీవుడ్‌లోనే. కన్నడలోనూ అమ్మడికి అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయట.

ఇవీ చదవండి:

రామ్ చరణ్ కూతురి జాతకంపై సంచలనం విషయాలు వెల్లడించిన వేణుస్వామి

లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదిలేసిన లావణ్య త్రిపాఠి

సముద్రపు అడుగున ఎన్టీఆర్, సైఫ్‌ల యుద్ధం.. ఈసారి కొరటాల బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమేనట..

మెగా ఫ్యామిలీ కోరిక తీరలేదా? సెంటిమెంట్ వెంటాడిందా?

రాకేష్ మాస్టర్ దుస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లాగవు..!

పెళ్లైన హీరోతో సమంత ప్రేమాయణం..?

Google News