Pooja Hegde: మహేష్ వేధింపుల వల్లే పూజా హెగ్డే ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుందట.. దీనిలో నిజమెంత?

Pooja Hegde: మహేష్ వేధింపుల వల్లే పూజా హెగ్డే ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుందట.. దీనిలో నిజమెంత?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’(Guntur Kaaram). ఈ మూవీలో తొలుత హీరోయిన్‌గా పూజా హెగ్డే ఎంపికైంది. అయితే ఎందుకోగానీ పూజా ఈ మూవీ నుంచి సడెన్‌గా తప్పుకుంది. దీంతో రకరకాల కథనాలు వెలుగు చూస్తున్నాయి. అందులో షాకింగ్ కథనం కూడా ఒకటి ఉండటం గమనార్హం. అదేంటంటే మహేష్ బాబు పూజాను విపరీతంగా వేధింపులకు గురి చేశాడట.

నిజానికి ఇటీవలి కాలంలో పూజా హెగ్డే(Pooja Hegde)కు వరుస ఫ్లాప్‌లు వస్తున్నాయి. దీంతో హీరోయిన్‌గా పూజా ఉండటం ఇష్టం లేని మహేష్ వేధింపులకు గురి చేశాడని టాక్. ఏవేవో కారణాలు చెబుతూ ఆమెకు చుక్కలు చూపించాడట. ఈ వేధింపులు తాళలేక పూజా హెగ్డే తను తీసుకున్న అడ్వాన్స్‌ను నిర్మాతలకు తిరిగి ఇచ్చేసి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని బీభత్సంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని కొందరు కొట్టి పడేస్తున్నారు.

మహేష్.. తన సినిమాలో ఎవరు ఉండాలో.. ఉండకూడదో ముందుగానే నిర్ణయించి చెప్పగల సత్తా ఉన్న హీరో. ఆయన వద్దంటే దర్శక నిర్మాతలు వెంటనే మారు మాట్లాడకుండా పక్కన బెట్టేస్తారు. అలాంటి మహేష్‌(Mahesh Babu)కి ఇష్టం లేకుండా పూజా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం.. ఆయన వేధింపులకు గురి చేయడం అనేది చాలా పెద్ద అబద్ధం. ఇప్పటి వరకూ మహేష్ గురించి ఇలాంటి రూమర్స్ వినిపించలేదు. ఆయన ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఒక్క హీరోయిన్ గురించి కూడా తప్పుగా మాట్లాడింది లేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు అలా చేస్తారు? సమస్యే లేదు.

ఇవీ చదవండి:

లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదిలేసిన లావణ్య త్రిపాఠి

శ్రీలీల చేస్తున్న సినిమాల లిస్ట్ పెద్దదే.. 2025 నాటికి ఎన్ని కోట్లను తన ఖాతాలో వేసుకుంటుందో తెలిస్తే..

రామ్ చరణ్ కూతురి జాతకంపై సంచలనం విషయాలు వెల్లడించిన వేణుస్వామి

వెబ్‌సిరీస్‌లో ప్రియుడితో కలిసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన తమన్నా..

సముద్రపు అడుగున ఎన్టీఆర్, సైఫ్‌ల యుద్ధం.. ఈసారి కొరటాల బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమేనట..

Google News