Keerthy Suresh: డ్రైవర్‌తో కీర్తి సురేష్ లవ్.. ఫ్యాన్స్ ఫైర్..!

Keerthy Suresh: డ్రైవర్‌తో కీర్తి సురేష్ లవ్.. ఫ్యాన్స్ ఫైర్..!

ఈ మధ్య కీర్తి సురేష్(Keerthy Suresh) ఎందుకోగానీ తెగ వైరల్ అవుతోంది. ఎందుకోగానీ ఇటీవలి కాలంలో ఆమెపై రూమర్స్ బాగా ఎక్కువవుతున్నాయి. ఫ్రెండ్‌తో పెళ్లన్నారు.. ఆ తరువాత క్లాస్‌మేట్‌తో పెళ్లన్నారు.. ఇక ఇప్పుడు ఏకంగా డ్రైవర్‌తో ప్రేమలో కీర్తి ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకోగానీ అమ్మడిపై లోటు లేకుండా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఒక వ్యక్తితో కీర్తి సురేష్ కాస్త క్లోజ్‌గా ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఇక అంతే..

ఆ వ్యక్తి మరెవరో కాదు.. కీర్తి డ్రైవరే. అతనితో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందంటూ ఏకంగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను చూసిన కీర్తి సురేష్(Keerthy Suresh) ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఎవరితో క్లోజ్‌గా ఉంటే వారితో అఫైర్ ఉందంటూ వార్తలు రాయడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోల ఆధారంగా దారుణ కథనాలు రాసేస్తారా? అని కీర్తి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ వ్యక్తి ఎవరనే దానిపై కూడా ఫ్యాన్స్ వివరణ ఇస్తున్నారు.

Keerthy Suresh: డ్రైవర్‌తో కీర్తి సురేష్ లవ్.. ఫ్యాన్స్ ఫైర్..!

నిజానికి కీర్తి సురేష్ పక్క ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి టెక్నీషియన్ అని.. భోళా శంకర్(Bhola Shankar) చిత్రానికి పని చేస్తున్నాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ సినిమా సెట్స్‌లో అందరి మాదిరిగానే కీర్తి సురేష్‌తో ఫోటోలు దిగాడని వెల్లడించారు. అవి కాస్తా వైరల్ అయ్యాయని ఫ్యాన్స్ అంటున్నారు. కీర్తి(Keerthy Suresh) మాత్రం ఈ వార్తలను లైట్ తీసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్స్ సర్వసాధరణమే కానీ మరీ ఇంతలా ఎవరితో పడితే వాళ్లతో అంటగట్టి కథనాలు రాయడమేంటని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇవీ చదవండి:

శ్రీలీల చేస్తున్న సినిమాల లిస్ట్ పెద్దదే.. 2025 నాటికి ఎన్ని కోట్లను తన ఖాతాలో వేసుకుంటుందో తెలిస్తే..

రామ్ చరణ్ కూతురి జాతకంపై సంచలనం విషయాలు వెల్లడించిన వేణుస్వామి

లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదిలేసిన లావణ్య త్రిపాఠి

మెగా ఫ్యామిలీ కోరిక తీరలేదా? సెంటిమెంట్ వెంటాడిందా?

ఆదిపురుష్ వసూళ్లన్నీ హమ్మక్.. తప్పుతప్పుగా చెబుతున్నారట..

Google News