Kabir Duhan Singh: ఆమె జీవితంలో ఇక నుంచి నేనే హీరో: సర్దార్ గబ్బర్ సింగ్ విలన్

Kabir Duhan Singh: ఆమె జీవితంలో ఇక నుంచి నేనే హీరో : సర్దార్ గబ్బర్ సింగ్ విలన్

శాకుతలం(Shaakunthalam) మూవీలో అసుర, సర్దార్ గబ్బర్ సింగ్, గోపిచంద్, రాశిఖన్నా జంటగా నటించిన జిల్, సాక్ష్యం మూవీలో విలన్ గుర్తున్నాడా? గుర్తుండే ఉంటాడులే. జిల్ సినిమా వచ్చి చాలా కాలం అయినా కూడా శాకుంతలం ఇటీవలే వచ్చింది కాబట్టి గుర్తుండే ఉంటాడు. ఇంతకీ అతని పేరు కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh). ఈయన తెలుగు ఒక్కటే కాదండోయ్.. కన్నడ, తమిళంలో సైతం సినిమాలు చేశాడు. ఇక కబీర్ తాజాగా ఓ ఇంటివాడయ్యాడు.

సీమ చాహల్ అనే యువతిని కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh) పెళ్లాడాడు. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌లో అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలో కబీర్ దుహాన్ సింగ్, సీమలు ఒక్కటయ్యారు. ఆయన వివాహం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న దక్షిణాది సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Kabir Duhan Singh Marriage

ఇప్పటి నుంచి కొత్త జీవితం ప్రారంభిస్తున్నానని… తన స్నేహితులు, అభిమానులు అందరి ఆశీర్వాదంతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నానని కబీర్ వెల్లడించాడు. తన భార్యకి కూడా అందరి ఆశీస్సులు కావాలన్నారు. ఆమె జీవితంలో ఇక నేను హీరోగా జీవితాంతం కొనసాగుతానని కబీర్ దుహాన్ సింగ్(Kabir Duhan Singh) తెలిపాడు. కబీర్ స్వస్థలం హర్యానాలోని ఫరీదాబాద్. 2001 మోడలింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

ఇవీ చదవండి:

సమంతకు సపోర్ట్ చేసిన అమల

నా తండ్రి చావుకు కారణం వాళ్లే.. ఇప్పటికైనా ఆపేయండి: రాకేష్ మాస్టర్ కుమారుడు

డ్రైవర్‌తో కీర్తి సురేష్ లవ్.. ఫ్యాన్స్ ఫైర్..!

మహేష్ వేధింపుల వల్లే పూజా హెగ్డే ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుందట.. దీనిలో నిజమెంత?

లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదిలేసిన లావణ్య త్రిపాఠి

Google News