Bro: బ్రో నైజాం రైట్స్ ఎంతకు కోట్ చేశారో తెలిస్తే..

Bro: బ్రో నైజాం రైట్స్ ఎంతకు కోట్ చేశారో తెలిస్తే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న సినిమా బ్రో. వినోదాయ సీతమ్ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో కేతిక శర్మ(Kethika Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ త్వరలోనే విడుదల కానుంది. ఇక టీజర్ రిలీజ్ అయితే మాత్రం పవన్ ఫ్యాన్స్‌ని పట్టుకోవడం చాలా కష్టం. అసలే.. టీజర్‌తో అంచనాలు విపరీతంగా పెరుగుతాయనే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. పవన్ సినిమా అంటేనే పెద్దగా ప్రమోషన్స్ అక్కరలేకుండానే జనాల్లోకి వెళ్లిపోతుంది. ఇక ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ కోసం అప్పుడే డిమాండ్ ఏర్పడిందనే టాక్ నడుస్తోంది.

Bro: పవన్ ‘బ్రో’ స్టోరీ ఇదేనట.. కథ పాతదే కానీ..

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ ఒకరు నైజాం రిలీజ్ రైట్స్ కోసం ఏకంగా 30 కోట్ల రూపాయిలు కోట్ చేసారని సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ మొత్తానికి నైజాం హక్కులు ఇవ్వడానికి సిద్ధమైపోయిందట. మొత్తానికి ఈ చిత్రంపై బిజినెస్ దాదాపు రూ.130 కోట్లు జరిగే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. వచ్చే నెల 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవీ చదవండి:

ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

మత్తుకు బానిసై నా భార్య డ్రగ్స్ విక్రేతతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది: ప్రముఖ నిర్మాత సంచలనం

ఆమె జీవితంలో ఇక నుంచి నేనే హీరో: సర్దార్ గబ్బర్ సింగ్ విలన్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి, ఈ నగరానికి ఏమైంది హీరో?

Google News