Bro Posters: ఆ పోస్టర్స్‌ చూసి పవన్ ‘బ్రో’ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న ఫ్యాన్స్..

Bro Posters: ఆ పోస్టర్స్‌ చూసి పవన్ ‘బ్రో’ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న ఫ్యాన్స్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. బ్రో టీజర్(Bro Teaser) విడుదలకు సర్వం సిద్ధమైపోయింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. టీజర్ ప్రకటనకు సంబంధించిన పోస్టర్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవన్, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఊర మాస్ గెటప్స్‌లో కనిపించారు. పవన్ లుంగీ కట్టి మరీ కనిపించడం ఆసక్తికరంగా మారింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

Bro Posters: ఆ పోస్టర్స్‌ చూసి పవన్ ‘బ్రో’ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న ఫ్యాన్స్..

బ్రో(Bro) సినిమా పోస్టర్‌‌లో పవన్(Pawan Kalyan) లుక్‌ను చూసిన ఫ్యాన్స్ దానిని తమ్ముడు చిత్రంలోని లుక్‌లా అనిపిస్తోందంటూ తెగ మురిసిపోతున్నారు. మొత్తానికి ఈ చిత్రం తమ్ముడు మాదిరిగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు. నేడు మరొక స్టిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పవన్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంది. టాప్ టు బోటమ్ ట్రెండీ లుక్‌లో పవన్ అదరగొడుతున్నారు. ఇక ఓ లుక్ అయితే జల్సా(Jalsa) మూవీలోని పవన్‌ను గుర్తు చేసింది.

Bro Posters: ఆ పోస్టర్స్‌ చూసి పవన్ ‘బ్రో’ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న ఫ్యాన్స్..

ఇక బ్రో టీజర్ వచ్చేసి నేటి సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల కానుంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ స్టిల్ కూడా విడుదలైంది. టక్ చేసుకుని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిగా సాయిధరమ్ లుక్ ఆకట్టుకుంది. మొత్తానికి ఈ పోస్టర్స్ చూసిన వారంతా పవన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ చిత్రం వచ్చే నెల 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

బ్రో నైజాం రైట్స్ ఎంతకు కోట్ చేశారో తెలిస్తే..

తన గురించి వైరల్ అవుతున్న న్యూస్‌పై లావణ్య త్రిపాఠి ఫైర్..

మత్తుకు బానిసై నా భార్య డ్రగ్స్ విక్రేతతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది: ప్రముఖ నిర్మాత సంచలనం

ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

సమంతకు సపోర్ట్ చేసిన అమల

Google News