Director Karthik Dandu: ‘విరూపాక్ష’ డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాతలు

Director Karthik Varma: ‘విరూపాక్ష’ డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాతలు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej)కు చాలా కాలం తర్వాత ‘విరూపాక్ష’(Virupaksha) ఒక మాంచి హిట్ దొరికింది. ఈ చిత్రం నిర్మాతలకు సైతం వసూళ్ల వర్షం కురిపించింది. కొత్తదనానికి ఎప్పుడూ కూడా ప్రేక్షకులు ఓటేస్తుంటారు. ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్‌ల హవా నడుస్తోంది. ఎంత భయపెడితే అంత పెద్ద హిట్. ప్రేక్షకుడికి సస్పెన్స్ పోకుండా సినిమాను నడిపించగలితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది.

ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు(Karthik Varma) ‘విరూపాక్ష’ను రూపొందించారు. ఈ సినిమా థియేటర్‌లోనే కాదు… ఓటీటీలోనూ హవా సాగిస్తోంది. ఈ సినిమా మొత్తంగా రూ.100 కోట్లు సాధించిందంట. చిన్న సినిమా.. పైగా సింపుల్ బడ్జెట్‌తో రూపొంది.. రూ.100 కోట్లు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో నిర్మాతలు కార్తీక్ వర్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. కాస్ట్లీ బెంజ్ కారును గిప్ట్‌గా ఇచ్చారు.

Virupaksha Director Gets Gi

రూ.60 నుంచి 80 లక్షల విలువ చేసే బెంజ్ సీ క్లాస్ మోడల్ ఉన్న కారును కార్తీక్ దండు(Karthik Varma)కు నిర్మాతలు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ కారును తన గురువు సుకుమార్, హీరో సాయి ధరమ్ చేతుల మీదుగా కార్తీక్ దండు అందుకున్నారు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో మరచిపోలేని గిఫ్ట్ ఇదని కార్తీక్ దండు మెసేజ్ చేశారు. అభిమానులు తిరిగి అలాంటి హారర్ మూవీని రూపొందించాలని కోరుతున్నారు.

Google News