Renu Desai: రేణు దేశాయ్ కాలికి దెబ్బలు.. ఒక వేలు చితికిపోయిందట..

Renu Desai Injured

రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు. తొలుత సినీ హీరోయిన్‌గానూ.. ఆపై పవన్ కల్యాణ్ భార్యగానూ.. ఆ తరువాత ఆయన నుంచి విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడైతే తనకంటూ సొంత ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఓ డ్యాన్స్ షోకి జడ్జిగా కూడా రేణు వ్యవహరించారు. మరోవైపు సోషల్ మీడియాలో సైతం రేణు చాలా యాక్టివ్‌గా ఉంటారు.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలనూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలతో పాటు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సైతం ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో రేణు దేశాయ్(Renu Desai) అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇక రేణు, పవన్‌ల కుమారుడు అకీరా నందన్ అంటే పవన్ అభిమానుల్లో విపరీతమైన అభిమానం ఉంది.

Renu Desai: రేణు దేశాయ్ కాలికి దెబ్బలు.. ఒక వేలు చితికిపోయిందట..

తాజాగా అకీరా నందన్(Akira Nandan) జిమ్ వర్కౌట్ వీడియోని రేణు దేశాయ్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’(Tiger Nageswara Rao) చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో రేణు (Renu Desai) నటిస్తున్నారు. ఇక ఈ షూటింగ్‌లో రేణుకి కాలికి దెబ్బలు తగిలాయో ఏమో కానీ ఆమె తన కాళ్లకు దెబ్బలు తగిలాయని.. అందువల్ల కాలి వేళ్లు బాగా దెబ్బతిన్నాయని.. వాటిలో ఒకటి చితికి పోయిందని తెలిపారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Google News