Bro Teaser: ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో టీజర్.. ఎన్ని వ్యూస్ రాబట్టిందో తెలిస్తే..

Bro Teaser: ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో టీజర్.. ఎన్ని వ్యూస్ రాబట్టిందో తెలిస్తే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘బ్రో’(Bro). సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్.. నిన్న సాయంత్రం విడుదలైంది. ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’ అంటూ సింగిల్‌ డైలాగ్‌తో టీజర్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ డైలాగ్‌కు ప్రేక్సకులు సైతం బాగా కనెక్ట్ అయ్యారు.

ఈ టీజర్‌ను ఒక నిమిషం 27 సెకెన్ల నిడివితో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌లో సముద్రఖని.. ఎమోషన్స్‌, యాక్షన్‌, హ్యూమర్‌, మాస్‌ ఎలిమెంట్స్‌, లవ్‌, ప్రత్యేక గీతం ఇలా అన్ని అంశాలను కలగలిపి చూపించారు. ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సెట్ చేస్తోంది. ఈ టీజర్‌ను చూసి పవన్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సినిమా పక్కా హిట్ అనే నిర్ణయానికి వచ్చేశారు.

Bro Posters: ఆ పోస్టర్స్‌ చూసి పవన్ ‘బ్రో’ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్న ఫ్యాన్స్..

ముఖ్యంగా హీరోల ఎలివేషన్ అభిమానులకు తెగ నచ్చేసింది. మొత్తానికి వ్యూస్ మిలియన్లలో వస్తున్నాయి. బ్రో టీజర్..12 గంటల్లో 10 మిలియన్‌ వ్యూస్‌ రాబట్టింది. 14 గంటలు దాటేసరికి టీజర్ వచ్చేసి 14 మిలియన్లకు చేరింది. ఇక 24 గంటల్లో ఎన్ని వ్యూస్ సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తమిళంలో హిట్టైన వినోదాయా సిత్తం’ చిత్రానికి రీమేక్‌‌గా ఈ చిత్రం రూపొందింది. జులై 28న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇవీ చదవండి:

బ్రో నైజాం రైట్స్ ఎంతకు కోట్ చేశారో తెలిస్తే..

తన గురించి వైరల్ అవుతున్న న్యూస్‌పై లావణ్య త్రిపాఠి ఫైర్..

రేణు దేశాయ్ కాలికి దెబ్బలు.. ఒక వేలు చితికిపోయిందట..

ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

Google News