నిహారికతో విడాకులపై చైతన్య జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చేసినట్టేనా?

నిహారికతో విడాకులపై చైతన్య జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చేసినట్టేనా?

మెగా డాటర్ నిహారిక(Niharika Konidela) తన భర్త చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda)తో విడిపోయిందనే న్యూస్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ దీనిని బలపరుస్తూనే ఉన్నాయి. తొలుత చైతన్య తన ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫోటోలను తొలగించారు. అప్పటి నుంచి విడాకుల వార్తలు ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే అయితే నిహారిక ఫోటోలను డిలీట్ చేయలేదు కానీ కాస్త సమయం తీసుకుని ఆమె కూడా రిమూవ్ చేసింది.

ఇక ఈ మధ్య కాలంలో అయితే వీరిద్దరూ జంటగా కనిపించింది లేనే లేదు. కనీసం నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్(Varun Tej) నిశ్చితార్థంలో అయినా అంతా కలిసి కనిపిస్తారనే టాక్ నడిచింది. కానీ అక్కడ కూడా సోలో గానే కనిపించింది. దీంతో చాలా వరకూ విడాకుల వార్తలకు క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టుతో జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

నిహారికతో విడాకులపై చైతన్య జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చేసినట్టేనా?

ఇంతకీ చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) ఏం పోస్ట్ పెట్టాడంటే.. ఆయన పది రోజుల క్రితం మహారాష్ట్రలో గల గ్లోబల్ విపాసన మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లారట. అక్కడ పది రోజుల పాటు ఉన్నారు. అదొక గొప్ప మెడిటేషన్ సెంటర్. దీనిని సందర్శించిన చైతన్య తనకు గొప్ప అనుభూతి కలిగిందని.. అనుకున్నదానికి మించిన శాంతి లభించిందంటూ పోస్ట్ పెట్టారు. విడాకుల కారణంగా డిస్టర్బెన్స్‌లో ఉన్నందునే చైతన్య మెడిటేషన్‌ సెంటర్‌ను సందర్శించారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా నడుస్తోంది.

ఇవీ చదవండి:

నా మొదటి లిప్ కిస్ అతనితోనే.. : క్లారిటీ ఇచ్చిన తమన్నా

విమానాశ్రయంలో పూజా హెగ్డే చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో టీజర్.. ఎన్ని వ్యూస్ రాబట్టిందో తెలిస్తే..

పొట్టి నిక్కర్‌తో జిమ్‌లో వర్కవుట్స్‌తో అందాలను ఆరబోసిన యాంకర్ అనసూయ

Google News