Allu Arjun – Trivikram: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

Allu Arjun - Trivikram: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అ‍ర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్ హిట్ కేరాఫ్. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకూ వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. నాలుగోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ కాంబో రెడీ అయ్యింది. చాలా రోజులుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ రాబోతోందంటూ టాక్ వినిపిస్తూనే ఉంది. ఈ సారి వీరిద్దరి కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ రానుంది.

తాజాగా వీరిద్దరి కాంబోలో చిత్రానికి సంబంధించిన ప్రకటన రానే వచ్చింది. తాజాగా గీతా ఆర్ట్స్‌ , హారికా- హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా అల్లు అ‍ర్జున్‌- త్రివిక్రమ్‌లతో సినిమా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. దీనిని బలపరుస్తూ నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాకు సంబంధించి ఓ ట్వీట్‌ చేశారు. నేటి ఉదయం 10 గంటలకే మూవీకి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్‌ను చాలా ఆసక్తికరంగా ఇచ్చారు.

Allu Arjun - Trivikram: అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

ఓ వీడియో ద్వారా వారు మూవీకి సంబంధించి అప్‌డేట్‌ ఇచ్చారు. బన్నీ పాన్ ఇండియా స్టార్‌గా మారేందుకు ఈ సినిమా చాలా హెల్ప్ కానుంది. ఇప్పటికే పుష్ప సినిమాతో ఐకాన్‌ స్టార్‌గా బన్నీ గుర్తింపు తెచ్చుకున్నాడు. నెక్ట్స్ సినిమా కూడా పాన్ ఇండియా అయితే బన్నీ రేంజ్ ఎక్కడికో వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా ఉంటుందని సమాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.

Google News