Devara: దూకుడు మీదున్న యంగ్ టైగర్‌.. ‘దేవర’ ఐదో షెడ్యూల్ గురించి ఆసక్తికర అప్‌డేట్..

Devara: దూకుడు మీదున్న యంగ్ టైగర్‌.. ‘దేవర’ ఐదో షెడ్యూల్ గురించి ఆసక్తికర అప్‌డేట్..

మ్యాన్ ఆఫ్‌ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాంచి దూకుడు మీదున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా తర్వాత ఇద్దరు స్టార్ డైరెక్టర్లను ఎన్టీఆర్ లైన్‌లో పెట్టాడు. దీంతో చకచకా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ 4 షెడ్యూల్‌లు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఐదో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతోంది.  

ఐదో షెడ్యూల్ గురించి ఒక ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ షెడ్యూల్‌లో రెండు భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని టాక్. గత షెడ్యూల్‌లో సముద్రంలో సీన్స్‌ను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు ఒకే షెడ్యూల్‌లో రెండు హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందట. ఈ మేరకు మూవీ టీమ్ నుంచే ఓ అధికారిక ప్రకటన రానే వచ్చింది. ఈ రెండు ఫైట్ సీన్స్ కూడా పెద్ద ఫైట్ మాస్టర్స్‌తో చేయించబోతున్నారట.

Devara: దూకుడు మీదున్న యంగ్ టైగర్‌.. ‘దేవర’ ఐదో షెడ్యూల్ గురించి ఆసక్తికర అప్‌డేట్..

మొదటి ఫైట్ సన్నివేశాన్ని పీటర్ హెయిన్స్ మాస్టర్‌తోనూ… రెండో సన్నివేశాన్ని సాల్మన్ మాస్టర్‌తోనూ చేయించబోతున్నారట. నేటి నుంచే పీటర్ హెయిన్స్ రంగంలోకి దిగబోతున్నారని టాక్. రెండు ఫైట్ సీన్స్ కూడా వేరే లెవల్లో ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి వార్ 2, ప్రశాంత్ నీల్‌తో సినిమాల కోసం ఎన్టీఆర్ ఏమాత్రం టైమ్ వేస్ట్ చేసుకోకుండా తెగ కష్టపడుతున్నాడు. ఇక ‘దేవర’ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న వేసవి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇవీ చదవండి:

నిహారికతో విడాకులపై చైతన్య జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చేసినట్టేనా?

ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్‌.. ఆయన రికార్డ్‌ను బ్రేక్ చేస్తారా?

బాల్స్ లేవు.. వజైనా ఉందంటూ అనసూయను ఇచ్చిపడేసిందిగా..!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ.. అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..

Google News