మెగా ఫ్యామిలీలో మరొకరు విడాకులు.. అనుకున్నదే జరిగిందే..!

మెగా ఫ్యామిలీలో మరొకరు విడాకులు.. అనుకున్నదే జరిగిందే..!

అనుకున్నదంతా అయ్యింది. మెగా డాటర్ నిహారిక(Niharika Konidela) భర్తతో విడాకులకు అప్లై చేసింది. ఎప్పటి నుంచో నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకోబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎప్పుడైతే చైతన్య(Chaitanya Jonnalagadda) తన సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి నిహారికతో కలిసి ఉన్న పిక్స్‌ను డిలీట్ చేశారో అప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. తొలుత నిహారిక అయితే డిలీట్ చేయలేదు కానీ ఆ తరువాత ఆమె కూడా చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది.

ఈ ఫోటోల డిలీట్ వ్యవహారంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే విడాకుల విషయంపై కొన్ని అనుమానాలు కూడా నెలకొన్నాయి. మెల్లమెల్లగా అన్ని విషయాలపై క్లారిటీ వచ్చింది. నిహారిక ఎక్కడా కూడా భర్తతో కలిసి కనిపించకపోవడం.. కనీసం ఆమె సోదరుడు హీరో వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి కూడా చైతన్య జొన్నలగడ్డ హాజరు కాకపోవడం వంటి అంశాలన్నీ వీరి విడాకుల అనుమానాలను బలపరిచాయి.

Niharika Konidela Chaitanya Jonnalgadda

ఇక తాజాగా చైతన్య చేసిన ట్వీట్ కూడా విడాకుల అంశానికి మరింత బలాన్ని చేకూర్చింది. మహారాష్ట్రలోని గ్లోబల్ విపాసన మెడిటేషన్ సెంటర్‌కు వెళ్లానని.. దీని సందర్శించిన తనకు గొప్ప అనుభూతి కలిగిందని.. అనుకున్నదానికి మించిన శాంతి లభించిందంటూ పోస్ట్ పెట్టారు. విడాకుల విషయంపై డిస్టర్బెన్స్ కారణంగానే చైతన్య అక్కడకు వెళ్లారని టాక్ నడిచింది. ఇక నిహారిక కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో హిందూ చట్ట ప్రకారం విడాకులకు దరఖాస్తు చేసింది.

ఇవీ చదవండి:

ఇదీ పవన్ కల్యాణ్ అంటే… 2 మిలియన్లకు చేరువలో ఇన్‌స్టా ఫాలోవర్లు

దూకుడు మీదున్న యంగ్ టైగర్‌.. ‘దేవర’ ఐదో షెడ్యూల్ గురించి ఆసక్తికర అప్‌డేట్..

ఇకపై పవన్‌కి దూరం అంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్..

బాల్స్ లేవు.. వజైనా ఉందంటూ అనసూయను ఇచ్చిపడేసిందిగా..!

కేజీఎఫ్ 2కి.. సలార్‌కి లింకేంటి?.. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

Google News