Salaar Teaser Memes: సలార్ టీజర్ విడుదల టైంపై మీమ్సే మీమ్స్..

salaar teaser memes

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌(Prasanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు తాజాగా చిత్ర యూనిట్ ఒక హ్యాపీ న్యూస్ అందించింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రేపు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం తెల్లవారుజామున 5.12గంటలకు టీజర్‌ విడుదల కానుంది. వేరొక టైమ్ అయితే ఏమో కానీ తెల్లవారుజామున 5 గంటలకు అనేసరికి సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తుతున్నాయి. ఈ టీజర్‌పై ఒక్కొక్కరు.. ఒక్కోలా.. స్పందిస్తున్నారు. ఒకరు 7/g.. ఇంకొకరు అమృతం.. ఇంకొందరు కేజీఎఫ్.. మరికొందరు డార్లింగ్ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు.

బ్రహ్మీ మీమ్స్‌ ఉండనే ఉన్నాయి కదా.. పిచ్చెక్కిస్తున్నారనుకోండి. అవి చూస్తే కడుపుబ్బ నవ్వకుండా ఉండలేరు. అసలు ఈ టైంలో టీజర్ రిలీజ్ ఏంటి..? అదేమైనా బ్రహ్మ ముహూర్తమా? అంటూ మరికొందరు చిత్ర యూనిట్‌ను ఏకి పారేస్తున్నారు. అయినా సరే.. ఫ్యాన్స్ మాత్రం టైంతో సంబంధం లేకుండా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సలార్ టీజర్‌కు కేజీఎఫ్ 2 క్లైమాక్స్‌కు లింక్ ఉంటుందన్న ప్రచారంతో టీజర్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

Google News