విడాకులపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన నిహారిక, చైతన్య..

విడాకులపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టిన నిహారిక, చైతన్య..

మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela), తన భర్త చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda)తో విడాకులు తీసుకునేందుకు కోర్టు మెట్టెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయమై ఇన్‌స్టా వేదికగా నిహారిక ఓ నోట్ పెట్టింది. అలాగే చైతన్య జొన్నలగడ్డ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని నిహారిక తెలిపింది. ఇంచుమించు ఇదే విధంగా చైతన్య కూడా పోస్ట్ పెట్టారు.

తాను, చైతన్య పరస్పర అగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని నిహారిక తెలిపింది. తన వెంటే ఉంటూ మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ సందర్భంగా ధన్యవావాలు తెలిపింది. ఈ పరిణామాల తర్వాత తమ జీవితాల్లో తాము ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రైవసీ కావాలని అందరినీ కోరకుంటున్నామని నిహారిక తెలిపింది. తనను అర్థం చేసకున్నందుకు ధన్యవాదాలు తెలిపింది.

niharika konidela divorce

నిహారిక పెట్టిన మ్యాటర్‌నే చైతన్య కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇక 2020 డిసెంబర్‌లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా రాజస్థాన్‌లో జరిగింది. ఆ తరువాత కొంతకాలం పాటు వీరిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. నిహారిక వెబ్ సిరీస్‌లతో తన కెరీర్‌లో బిజీ అయిపోయింది.

ఇవీ చదవండి:

ఇకపై పవన్‌కి దూరం అంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్..

సినిమాలకు బ్రేక్.. నిర్మాతలు, ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సమంత

కేజీఎఫ్ 2కి.. సలార్‌కి లింకేంటి?.. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

సలార్ టీజర్ విడుదల టైంపై మీమ్సే మీమ్స్..