నిహారిక, చైతన్యలు విడిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ముందుగా అప్లై చేశారంటే..

నిహారిక, చైతన్యలు విడిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ముందుగా అప్లై చేశారంటే..

మెగా డాటర్ నిహారికా(Niharika Konidela), చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) జంట విడిపోయినట్లు, విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. నిజానికి ఈ జంట గత కొంత కాలంగా ఎక్కడా కలిసి కనిపించింది లేదు. వీరిద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. ఇక వీరిద్దరి విడాకుల వ్యవహారానికి సంబంధించిన ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి చైతన్య హాజరుకాకపోవడంతో క్లారిటీ వచ్చింది.

అయితే నిహారిక, చైతన్యల(Niharaika Konidela – Chaitanya Jonnalagadda) జంట ఇంత త్వరగా విడిపోవడానికి గల కారణాలేంటనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముందుగా డివోర్స్ కు అప్లై చేసింది ఎవరు? అసలు వీరిద్దరిలో విడిపోవడానికి మెయిన్ కారణం ఎవరు? అనేది కూడా చర్చగా మారింది. గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఈ జంట తాజాగా విడాకులకు అప్లై చేసింది. కూకట్‌పల్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు.

Niharika Konidela, Chaitanya Jonnalagadda

అయితే ఈ జంట పెళ్లై పట్టుమని మూడేళ్లు కూడా కాకముందే ఇంత త్వరగా విడిపోవడానికి మనస్పర్థలే ముఖ్య కారణంగా తెలుస్తోంది. పెళ్లి తర్వాత నిహారిక పలు వివాదాల్లో చిక్కుకుంది. ఓ సారి పబ్‌లో నిహారిక ఉండటం.. అదే సమయంలో ఆ పబ్‌లో డ్రగ్స్ పెద్ద ఎత్తున తీసుకుంటున్నారన్న న్యూస్‌తో పోలీసులు అలెర్ట్ అవడం.. మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. ఆ తర్వాత అపార్ట్‌మెంట్ వాళ్లతో గొడవ అంటూ మరో వివాదం.. ఈ వివాదాలన్నింటి కారణంగా విసిగి వేసారిన చైతన్య డివోర్స్‌కు అప్లై చేశారట. ఇక ఆ తరువాత నిహారిక విడాకుల కోసం పిటిషన్ వేసిందట.

ఇవీ చదవండి:

సలార్ టీజర్ విడుదల టైంపై మీమ్సే మీమ్స్..

సినిమాలకు బ్రేక్.. నిర్మాతలు, ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సమంత

ఇకపై పవన్‌కి దూరం అంటూ బండ్ల గణేష్ సంచలన ట్వీట్..

కేజీఎఫ్ 2కి.. సలార్‌కి లింకేంటి?.. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

Google News