Salaar Teaser: ‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఆసక్తికర విషయం ఏంటంటే..

Salaar Teaser: ‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఆసక్తికర విషయం ఏంటంటే..

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సలార్‌’ టీజర్‌(Salaar Teaser) రానే వచ్చింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌‌కి సంబంధించిన టీజర్‌ కోసం ఫ్యాన్స్ తెల్లవారుజాము నుంచే వేచి చూస్తున్నారు. గురువారం తెల్లవారుజామున సలార్ టీజర్ విడుదలైంది. తొలుత హీరో ఇంట్రడక్షన్ సీన్‌తో టీజర్ ప్రారంభమయ్యింది. నిజంగా హీరో ఎలివేషన్ అదిరిపోయింది.

Prabhas in Salaar teaser

టిన్ను ఆనంద్ హీరో గురించి చెబుతుంటారు. ‘సింహం.. చిరుత.. పులి.. ఏనుగు.. చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్‌ పార్క్‌లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో…’ అంటూ టీజర్‌ ప్రారంభంలో ప్రభాస్ గురించి టిన్ను ఆనంద్ చెబుతారు. ఆ తరువాత ప్రభాస్ కనిపిస్తాడు. ఈ టీజర్‌ చూస్తుంటే.. ప్రభాస్‌ మూవీ నుంచి అభిమానులు కోరుకునే అన్ని మాస్‌ అంశాలను పుష్కలంగా మేళవించి ‘సలార్‌’ను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.

Advertisement
Salaar teaser

అయితే టిన్ను ఆనంద్ డైలాగ్‌ను పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇంగ్లీష్‌లోనే పెట్టేశారు. అయితే ప్రభాస్‌(Prabhas)ను ఒక సైడ్ నుంచే చూపించారు ప్రశాంత్ నీల్. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా రెండు పార్టులు ఉంటుందని టీజర్‌లో చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘సలార్‌: పార్ట్‌1: సీజ్‌ఫైర్‌’ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి టీజర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉంది.

ఇవీ చదవండి:

సలార్ టీజర్ విడుదల టైంపై మీమ్సే మీమ్స్..

సినిమాలకు బ్రేక్.. నిర్మాతలు, ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సమంత

నిహారిక, చైతన్యలు విడిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ముందుగా అప్లై చేశారంటే..

కేజీఎఫ్ 2కి.. సలార్‌కి లింకేంటి?.. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్