విడుదలకు ముందే ప్రాజెక్ట్ K మూవీకి అరుదైన గౌరవం

విడుదలకు ముందే ప్రాజెక్ట్ K మూవీకి అరుదైన గౌరవం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K మూవీ విడుదలకు ముందే సంచలనంగా మారింది. శాన్ డియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్‌లో పాల్గొనే మొదటి ఇండియన్ మూవీగా అరుదైన గౌరవం అందుకుంది. ఈ నెల 20న జరిగే ఈ ఈవెంట్‌లో ప్రాజెక్ట్ కే టీమ్ పాల్గొని భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకూ ఏ భారతీయ చిత్రానికీ ఇలాంటి ఆహ్వానం అందలేదు. 

ఈ ఏడాది తెలుగు హీరోలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటించిన సినిమా ఆస్కార్ అవార్డును అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ మూవీ విడుదలకు ముందే అరుదైన గైరవాన్ని అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రాజెక్ట్ కే టీమ్ ప్రభాస్ ని సూపర్ హీరోగా చూపిస్తూ స్పెషల్ క్యారికేచర్ విడుదల చేశారు. ఈ క్యారికేచర్ ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.

Advertisement
విడుదలకు ముందే ప్రాజెక్ట్ K మూవీకి అరుదైన గౌరవం..

 శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే టీమ్ నుండి ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొననున్నారని సమాచారం. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రాజెక్ట్ కే అంటే ప్రాజెక్ట్ కృష్ణ అని.. అందులో ప్రభాస్ మోడ్రన్ కృష్ణుడిగా కనిపిస్తారని సమాచారం. ఇక రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో అలరించనుంది. ఒక్క ఆహ్వానంతో ఈ సినిమా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఇవీ చదవండి:

సమంతకు సంబంధించిన లేటెస్ట్ వీడియో వైరల్.. ఆమె పెళ్లి వీడియో అంటూ..

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌ కల్యాణ్‌ రికార్డ్.. ఇక అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సినీ సెలబ్రిటీలెవరో తెలుసా? 

‘సలార్’ టీజర్ ఇంత ముందుగా ఎందుకు వదిలారు? కారణం ఏంటంటే..

నిహారిక, చైతన్యలు విడిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ముందుగా అప్లై చేశారంటే..