సమంతకు సంబంధించిన లేటెస్ట్ వీడియో వైరల్.. ఆమె పెళ్లి వీడియో అంటూ..

సమంతకు సంబంధించిన లేటెస్ట్ వీడియో వైరల్.. ఆమె పెళ్లి వీడియో అంటూ..

స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఆమె పెళ్లి వీడియో అంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అది రియల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో. ప్రస్తుం సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ ఎండింగ్‌కి చేరుకుంది. ఈ చిత్ర పతాక సన్నివేశాలు ద్రాక్షారామంలో చిత్రీకరిస్తున్నారు.

అక్కడ విజయ్ దేవరకొండ-సమంత పెళ్లి సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని టాక్. ఎర్ర చీరలో సమంత అయితే మెరిసిపోతోంది. పెళ్లికి సంబంధించిన ఆనవాళ్లు అయితే కనిపించడం లేదు. మొత్తానికి ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే చివరి షెడ్యూల్ అని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. గత కొంతకాలంగా సామ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌లకు దూరంగా ఉంటూ వస్తోంది.

కాస్త గ్యాప్ తీసుకుని ఈ జోనర్ సినిమాను ఎంచుకుంది. ఈ సినిమా సామ్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంతో పాటు ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ కూడా ముగింపు దశకు వచ్చిందట. ఇవి రెండూ కంప్లీట్ అయితే ఒక ఏడాది పాటు సామ్ సినిమాలకు దూరంగా ఉంటుందట. ఇప్పటికే పలు సినిమాలకు తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేసిందని టాక్. ఇక మీదట సామ్ పూర్తి స్థాయిలో తన ఆరోగ్యంపై ఫోకస్ పెడుతుందట.

ఇవీ చదవండి:

‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఆసక్తికర విషయం ఏంటంటే..

నిహారిక, చైతన్యలు విడిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ముందుగా అప్లై చేశారంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌ కల్యాణ్‌ రికార్డ్.. ఇక అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సినీ సెలబ్రిటీలెవరో తెలుసా?

‘సలార్’ టీజర్ ఇంత ముందుగా ఎందుకు వదిలారు? కారణం ఏంటంటే..

Google News