Kangana Ranaut: రామ్ చరణ్, ఉపాసనల మినీ టెంపుల్‌పై స్పందించిన కంగనా

ప్రతిష్టాత్మక అవార్డు షోలలో ఒకటైన ఆస్కార్ (Oscar Awards) పండుగ దక్షిణాది ప్రజానీకానికి ఎంత సంతోషాన్ని పంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్‌(RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ లభించడం అనేది భారతీయులకు గర్వకారణంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవగానే.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan).. ఆయన సతీమణి ఉపాసన (Upasana) ఒక ఆలయాన్ని దర్శించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆస్కార్ పండుగ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో పాటు పలువురు ఆర్ఆర్ఆర్ (RRR) గ్యాంగ్ హాజరైంది. అయితే ఈ సందర్భంగా మరో న్యూస్ కూడా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ (Ram Charan) దంపతులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కూడా తమతో పాటు  శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడి ఫోటోలను తీసుకెళతారట. ఆస్కార్ (Oscar) తమ పాటను వరించిన తర్వాత చెర్రీ (Ram Charan) దంపతులిద్దరూ తాము తీసుకెళ్లిన దేవతల ఫోటోలకు పూజలు చేస్తూ కనిపించారు. 

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను, తన సతీమణి ఎక్కడికి వెళ్లినా.. అక్కడ ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటామని.. అది తమకు శక్తినివ్వడమే కాకుండా భారతదేశంతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యేలా చేస్తుందని చెర్రీ తెలిపాడు. దీనిపై తాజాగా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందించారు. వారి పోర్టబుల్ ఆలయానికి భక్తితో నమస్కరించారు. ఆమె ఇన్‌స్టా వేదికగా.. ‘‘ఇది సౌత్‌లో చాలా సాధారణం. నేను రాఘవ్ లారెన్స్ (Ragava Lawrence) సర్ (చంద్రముఖి 2 (Chandramukhi) హీరో) వ్యాన్‌కి వద్దకు వెళ్లినప్పుడు కూడా అక్కడ ఒక చిన్న కృష్ణ దేవాలయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను.. హరే కృష్ణ’’ అని పేర్కొన్నారు.

Sootiga Team

Recent Posts

‘Mr Bachchan’ has sizzling romance between lead pair

Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…

August 2, 2024

తెగ ట్రోలింగ్ అవుతోన్న కీర్తి

ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…

August 2, 2024

Congress to move privilege motion against PM Modi

The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…

July 31, 2024

మెడ్ ప్లస్ వివాదంలో శివజ్యోతి

బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…

July 31, 2024

తొడలు చూపిస్తోన్న కాంతార సుందరి

"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…

July 31, 2024

అది ఫేక్ అంటున్న అన్నపూర్ణ

ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…

July 31, 2024