Kangana Ranaut: రామ్ చరణ్, ఉపాసనల మినీ టెంపుల్‌పై స్పందించిన కంగనా

Kangana Ranuat, Ram Charan and Upasana

ప్రతిష్టాత్మక అవార్డు షోలలో ఒకటైన ఆస్కార్ (Oscar Awards) పండుగ దక్షిణాది ప్రజానీకానికి ఎంత సంతోషాన్ని పంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్‌(RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్‌కి ఆస్కార్ అవార్డ్ లభించడం అనేది భారతీయులకు గర్వకారణంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవగానే.. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan).. ఆయన సతీమణి ఉపాసన (Upasana) ఒక ఆలయాన్ని దర్శించుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆస్కార్ పండుగ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో పాటు పలువురు ఆర్ఆర్ఆర్ (RRR) గ్యాంగ్ హాజరైంది. అయితే ఈ సందర్భంగా మరో న్యూస్ కూడా వైరల్ అయ్యింది. రామ్ చరణ్ (Ram Charan) దంపతులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కూడా తమతో పాటు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడి ఫోటోలను తీసుకెళతారట. ఆస్కార్ (Oscar) తమ పాటను వరించిన తర్వాత చెర్రీ (Ram Charan) దంపతులిద్దరూ తాము తీసుకెళ్లిన దేవతల ఫోటోలకు పూజలు చేస్తూ కనిపించారు.

Ram Charan and Upasana

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను, తన సతీమణి ఎక్కడికి వెళ్లినా.. అక్కడ ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటామని.. అది తమకు శక్తినివ్వడమే కాకుండా భారతదేశంతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యేలా చేస్తుందని చెర్రీ తెలిపాడు. దీనిపై తాజాగా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందించారు. వారి పోర్టబుల్ ఆలయానికి భక్తితో నమస్కరించారు. ఆమె ఇన్‌స్టా వేదికగా.. ‘‘ఇది సౌత్‌లో చాలా సాధారణం. నేను రాఘవ్ లారెన్స్ (Ragava Lawrence) సర్ (చంద్రముఖి 2 (Chandramukhi) హీరో) వ్యాన్‌కి వద్దకు వెళ్లినప్పుడు కూడా అక్కడ ఒక చిన్న కృష్ణ దేవాలయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను.. హరే కృష్ణ’’ అని పేర్కొన్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!