Dil Raju: దిల్ రాజు కోట కూల్చేందుకు మైత్రీ మూవీస్ పెద్ద స్కెచ్చే గీసిందిగా..!

Dil Raju

దిల్ రాజు(Dil Raju).. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరేమో. డిస్ట్రిబ్యూటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ఇప్పడొక పెద్ద మూవీ మాఫియానే నడిపిస్తున్నారన్న టాక్ ఉంది. పరిశ్రమను మొత్తం గుప్పిట్లో పెట్టుకుని కొందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. నిజానికి థియేటర్స్ అన్నింటినీ తన గ్రిప్‌లో పెట్టుకున్నారని.. ఆయనకు అల్లు అరవింద్ (Allu Aravind), సురేష్ బాబు (Suresh Babu), ఏషియన్ సునీల్ (Asian Sunil)తోడై మాఫియాను రన్ చేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది.

2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య (Waltair Veerayya), వీరసింహారెడ్డి (Veera Simha Reddy) చిత్రాలను విడుదల చేయనున్నట్టు గత ఏడాదే నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమాలను దెబ్బతీసేందుకు దిల్ రాజు(Dil Raju) స్కెచ్ గీశారని అప్పట్లో టాక్ నడిచింది. తాను నిర్మించిన వారసుడు (Varasudu) చిత్రానికి పెద్ద మొత్తంలో థియేటర్స్ లాక్ చేసి చిరంజీవి(Chiranjeevi), బాలయ్య(Balakrsihna)లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ రెండు సినిమాలనూ మైత్రీ మూవీ మేకర్సే (Mythri Movie Makers) రూపొందించారు.

Dil Raju

దిల్ రాజు(Dil Raju) చేసిన రచ్చతో విసుగు చెందిన మైత్రీ మూవీ మేకర్స్.. డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు (Dil Raju)కు ఇవ్వకుండా సొంతగా విడుదల చేశారు. అది నచ్చని దిల్ రాజు (Dil Raju) థియేటర్స్ విషయంలో పట్టు బిగించారు. చెరపకురా చెడేవు అన్న రీతిలో ఫైనల్‌గా దిల్ రాజే (Dil Raju) నష్టపోయాడు. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya), వీరసింహారెడ్డి (Veera Simha Reddy)చిత్రాలకు థియేటర్స్ సమస్యా లేదు. మాంచి హిట్ కొట్టాయి. వారసుడు (Varasudu) చిత్రం మీద ఆశించిన విజయాన్నైతే అందుకోలేకపోయింది. ఇక మైత్రి కొత్త స్కెచ్ గీస్తోందట. ఇకపై డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎదగాలని భావిస్తోందట. తద్వారా దిల్ రాజు (Dil Raju)ను దెబ్బతీయాలని చూస్తోందట. ఇప్పటికే ఓ అడుగు ముందుకేసి రంగమార్తాండ (Rangamarthanda) హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!Malavika Mohanan: ఇదేం అరాచకం.. మరీ ఈ రేంజ్‌లోనా మాళవికా..!