Prakash Raj: ప్రకాష్ రాజ్‌ను రాజమౌళి ఎందుకు పక్కనబెట్టేశారు?
దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఏ సినిమా తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకేనేమో ఈగతో తీసినా కూడా వేలంవెర్రిగా చూశారు. ఆయన సినిమాలు అంత బాగుంటాయి మరి. సినిమా.. సినిమాకు అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఇక ఇప్పుడు ఆస్కార్ కూడా సాధించారు. ఇక మీదటే రాజమౌళి (Rajamouli)కి అసలు పరీక్ష. ప్రతి సినిమా ఆస్కార్ (Oscar) రేంజ్‌గానే ఉంటుందని భావిస్తారు కాబట్టి అంచనాలు ఇకపై ఆకాశాన్నంటుతాయి. అయితే ఇప్పుడొక ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది.
రాజమౌళి (Rajamouli) సినిమాల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) ఎందుకు కనిపించరు? ఒక్క విక్రమార్కుడు (Vikramarkudu) సినిమాలో తప్ప రాజమౌళి సినిమాల్లో దేనిలోనూ ప్రకాష్ రాజ్ (Prakash Raj) కనిపించరు. విక్రమార్కుడులో సైతం పోలీస్ ఆఫీసర్‌గా ఏదో అలా మెరుస్తారంతే. మరి ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఏమైనా మంచి నటుడు కాదా? అంటే.. అద్భుతమైన నటుడు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా, విలన్‌గా, తండ్రిగా నటించి అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. మరి అలాంటి నటుడిని జక్కన్న (Rajamouli) ఎందుకు పక్కనబెడుతున్నారు?
ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న జక్కన్నకు ఎదురవగా.. ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇప్పటి వరకూ అన్ని పాత్రలు చేశారని.. తన సినిమాల్లో ఆయనకు కొత్తగా ఇవ్వాల్సిన పాత్ర అంటూ ఏమీ లేదన్నారు. ఒకవేళ తాను అనుకున్న పాత్రలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) ను చూపించినప్పటికీ ప్రేక్షకులు బోర్‌గా ఫీలయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల తన సినిమాల్లో ప్రకాష్ రాజ్(Prakash Raj) ఎక్కువగా కనిపించరని జక్కన చెప్పుకొచ్చారు. అయితే నెటిజన్లు మాత్రం వీరిద్దరి మధ్య ఎందుకో గ్యాప్ వచ్చిందని అందుకే జక్కన్న (Rajamouli) ప్రకాష్ రాజ్‌ను పక్కనబెట్టేశారని చెప్పుకుంటున్నారు.