Amitabh Bachchan: ప్రభాస్ షూటింగ్‌లో అమితాబ్‌కు గాయాలు.. కదిలినా, ఊపిరి తీసుకున్నా నొప్పేనంటూ పోస్ట్..

సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కి ప్రాజెక్ట్ కె (Project K) షూటింగ్‌లో గాయాలయ్యాయి. ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లోనే అమితాబ్‌ (Amitabh Bachchan)కు గాయాలయ్యాయి. ఆయనకి గాయాలు కావడంతో పాటు పక్కటెముకల వద్ద గాయం అయినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. 

ఏఐజీ హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం బిగ్‌బీ ముంబైకి తిరిగి వెళ్లిపోయారు. నాలుగు రోజుల క్రితమే జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. అమితాబ్ (Amitabh Bachchan) తన బ్లాగ్ ద్వారా విషయం వెల్లడించారు. హైదరాబాద్‌లో ప్రాజెక్టు కే కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్‌లో నటించాల్సి వచ్చిందన్నారు. ఈ సన్నివేశంలో నటిస్తుండగానే.. పక్కటెముక మృదులాస్థి పాపింగ్ విరిగిందని, కుడి పక్కటెముకకు కండరాలు చిరిగిపోయాయని అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు అమితాబ్ తెలిపారు.

అయితే వైద్యులు ఆయనకు రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. తన గాయాలకు వైద్యులు కట్లు కట్టారని.. ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోమని చెప్పారన్నారు. అయితే పక్కటెముకల వద్ద గాయమవడంతో కదులుతున్నప్పుడు, ఊపిరి తీసుకుంటున్నప్పుడు బాధగా ఉంటోందని వెల్లడించారు. అంతా నార్మల్ అయ్యేందుకు కొన్ని వారాలు పడుతుందని డాక్టర్లు చెప్పారని అమితాబ్ (Amitabh Bachchan) వెల్లడించారు. ఇక ఈ రోజు సాయంత్రం జల్సా గేటు వద్ద ఎవరినీ కలవలేనని తన కోసం ఎవరూ రావద్దని తెలిపారు.

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024