అందాల రాక్షసి’ సినిమాతో వెండితెర కి హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఇంతకు ముందు అయితే ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పాల్సి వచ్చేదేమో కానీ ఇప్పుుడు మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుండటంతో అమ్మడు ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి ఏం మాట్లాడినా కూడా వైరల్ అయిపోతోంది. అప్పట్లో పట్టించుకోని విషయాలన్నీ ఇప్పుడు తెగ హైలైట్ అయిపోతున్నాయి.
అంతేకాదు.. అప్పట్లో ఏదైనా జరిగినా కూడా దాని వెనుక కారణం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనుకోవాల్సి వస్తోంది. తాజాగా లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రధాన పాత్రలో రూపొందిన ‘గీత గోవిందం’(Geetha Govindam) మూవీ ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లోనే సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను గడగడలాడించింది.
ఈ సినిమాలో నటించిన రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు ఎంత మంచి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మడు ఏకంగా స్టార్ హీరోయిన్ల మధ్య కుర్చీ వేసుకుని కూర్చొండిపోయింది. అయితే ఈ సినిమా తొలుత లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)కే వచ్చిందట. కానీ విజయ్ అంతకు ముందు నటించిన ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) మూవీ లిప్ లాక్స్‌తో నిండిపోవడంతో ఈ సినిమాలో కూడా కనీసం ఒక్కటైనా ఉంటుందని డ్రాప్ అయ్యిందట. వరుణ్ తేజ్(Varun Tej) కూడా ఈ సినిమా చేసేందుకు లావణ్యకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్.
ఇవీ చదవండి:
డైరెక్టర్ కృష్ణవంశీ, నేను ఒకే అమ్మాయిని ప్రేమించాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. : జేడీ చక్రవర్తి
మెగా ఫ్యామిలీ కోరిక తీరలేదా? సెంటిమెంట్ వెంటాడిందా?
బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్‌లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న…
ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌గా ఓ రేంజ్లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…
పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదిగాడు. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్ట్‌లో టాలీవుడ్లో…
పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…