Nani: వామ్మో.. ‘దసరా’కు నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

‘దసరా’(Dasara Movie) సినిమా ఇప్పటి వరకూ ఉన్న టాక్‌ను బట్టి చూస్తే నేచురల్ స్టార్ నాని (Nani) అకౌంట్‌లో మరో హిట్ పడ్డట్టేనని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది.  శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించింది. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహించింది. నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh)లు సైతం సినిమా కోసం ఎంత కష్టపడ్డారో.. ప్రమోషన్స్ కోసం కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు.

నాని మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదని.. రూ. 100 కోట్లు లోడ్ అవుతున్నాయ్ అంటూ ట్విటర్ వేదికగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దశాబ్దంలో చూసిన ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటని సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు. నూతన దర్శకుడు అయినప్పటికీ సెన్సేషనల్ కంటెంట్ ఇచ్చాడని.. నాని, కిర్తీ సురేశ్ పెర్ఫార్మెన్స్ అదిపోయిందంటూ ట్విటర్ టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా థియేట్రికల్ హక్కులను దిల్ రాజు భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. 

Advertisement

కాగా కన్నడలో కూడా బీభత్సమైన ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ భారీ ధరకు దసరా థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆసక్తికర విషయం వచ్చేసి నాని (Nani) రెమ్యూనరేషన్. ఈ సినిమా కోసం నాని ఏకంగా రూ. 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పారితోషికానికి సంబంధించిన సీక్రెట్స్ నటీనటులైతే బయటకు చెప్పరు. అయితే ఇప్పటి వరకూ ఒక్కో సినిమాకి 10 కోట్ల లోపే పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు మాత్రం డబుల్ తీసుకున్నట్టు టాక్. మరి దీనిలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Sootiga Team

Recent Posts

బాబు ఫిర్యాదుతో సంక్షేమ పథకాలకు ఈసీ మోకాలడ్డూ… ప్రజల వెతలు

మారవా.. నువ్వు మారవా అనే సినిమా డైలాగ్ గుర్తుంది కదా..! ఇంకోటి చెబుతా ఆగండి.. నువ్వు యదవ కాదు అని…

May 6, 2024

సమంత తాను నగ్నంగా ఉన్న పిక్ షేర్ చేసి.. డిలీట్ చేసిందా?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త నడుస్తూనే ఉంటుంది. తాజాగా సామ్ ఒక పోస్ట్ పెట్టి…

May 6, 2024

పుష్ప 2 నుంచి ఇంట్రస్టింగ్ అప్‌డేట్..

ఒక డిఫరెంట్ మేనరిజంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్‌లో పుష్ప సినిమాను హిట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప…

May 6, 2024

చంద్రబాబు ఎస్టేట్‌లో పవన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌: ముద్రగడ

ఏపీ రాజకీయాలు బీభత్సమైన హీట్‌ను రాజేస్తున్నాయి. ఈసారి అన్నా చెల్లెళ్లు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతుళ్లుగా విడిపోయి మరీ ఒకరిపై…

May 6, 2024

ఎల్లో ట్రాప్ లో రమేష్… తప్పు పోస్ట్ తో పేరు మటాష్

మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఎల్లో మీడియా కుట్రలో భాగమయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ట్వీట్ చేసి వెంటనే…

May 6, 2024

నాడు ఒప్పయింది నేడు తప్పయిందా ? నాలుక మడతేసిన టీడీపీ, ఎల్లో మీడియా

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో టీడీపీ.. దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది. ఎక్కడ ఈ యాక్ట్‌తో…

May 6, 2024