Nani: వామ్మో.. ‘దసరా’కు నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే..

Nani Remunaration For Dasar

‘దసరా’(Dasara Movie) సినిమా ఇప్పటి వరకూ ఉన్న టాక్‌ను బట్టి చూస్తే నేచురల్ స్టార్ నాని (Nani) అకౌంట్‌లో మరో హిట్ పడ్డట్టేనని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించింది. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైంది. చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహించింది. నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh)లు సైతం సినిమా కోసం ఎంత కష్టపడ్డారో.. ప్రమోషన్స్ కోసం కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు.

నాని మాస్ బ్యాటింగ్ మామూలుగా లేదని.. రూ. 100 కోట్లు లోడ్ అవుతున్నాయ్ అంటూ ట్విటర్ వేదికగా అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దశాబ్దంలో చూసిన ఉత్తమ చిత్రాల్లో ఇది ఒకటని సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు. నూతన దర్శకుడు అయినప్పటికీ సెన్సేషనల్ కంటెంట్ ఇచ్చాడని.. నాని, కిర్తీ సురేశ్ పెర్ఫార్మెన్స్ అదిపోయిందంటూ ట్విటర్ టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా థియేట్రికల్ హక్కులను దిల్ రాజు భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం.

Nani In Dasara Movie

కాగా కన్నడలో కూడా బీభత్సమైన ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ భారీ ధరకు దసరా థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆసక్తికర విషయం వచ్చేసి నాని (Nani) రెమ్యూనరేషన్. ఈ సినిమా కోసం నాని ఏకంగా రూ. 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పారితోషికానికి సంబంధించిన సీక్రెట్స్ నటీనటులైతే బయటకు చెప్పరు. అయితే ఇప్పటి వరకూ ఒక్కో సినిమాకి 10 కోట్ల లోపే పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు మాత్రం డబుల్ తీసుకున్నట్టు టాక్. మరి దీనిలో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!