చిరు ఇంత ఓవరయ్యారేంటి..? నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్..

ఇండస్ట్రీకి వచ్చిన అతికొద్ది కాలంలోనే మహానటిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఈ ముద్దుగుమ్మ నటన విషయంలోనూ.. అందం విషయంలోనూ తీసి పడేసేది ఏమీ లేదు. అందానికి అందం.. అభినయానికి అభినయం రెండూ మెండుగా ఉన్నాయి. అందుకేనేమో.. అంతటి మహానటి సావిత్రి పాత్రలో నటించే అవకాశం అమ్మడికి వచ్చింది. ఏమాత్రం అన్యాయం చేయకుండా ఆ పాత్రలో కీర్తి జీవించేసింది.

ఇక వ్యక్తిత్వ పరంగా కూడా కీర్తి సూపర్బ్ అని ఆమెతో నటించిన నటులు చెబుతుంటారు. అయితే తాజాగా భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్సే కాస్త ఓవర్‌గా అనిపిస్తున్నాయి. నెట్టింట చిరుపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. చిరు ఇంత ఓవర్ అయ్యాడేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కీర్తిని ఐ మిస్ యూ డార్లింగ్ అంటూ స్టేజ్‌పై దగ్గరకు తీసుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నారు.

చిరు ఏమన్నారంటే.. ‘‘నేను అన్నయ్యగా చాలా మందికి ఉన్నాను. నీకు అక్కర్లేదని డే వన్నే చెప్పాశాను. నువ్వు నా నెక్ట్స్ పిక్చర్‌లో హీరోయిన్‌గా ఉంటే చాలు. ఎంత సరదాగా ఉంటుంది అంటే.. ఒక స్వచ్ఛమైన నవ్వు. ఒక జాబిలి.. వెన్నెల లాంటి నవ్వు. చెప్పాలంటే.. ఈ అమ్మాయితో షూటింగ్ చేస్తున్నప్పుడు గలగలా పారే నది మీద ఒక పడవ ప్రయాణం లాగా ఉంటుంది. నేను తనని మిస్ అవుతున్నాను అంటే.. నేను తగ్గిపోతున్నానేమో నా లెవల్‌కి అని నేను అనలే. పాపం తను రెండు, మూడు సార్లు అనేసరికి నేను ఒకసారి అనకపోతే బావుండదని చెప్పాను. ఐ మిస్ యూ డార్లింగ్.. ఐ మిస్ యూ సోమచ్’’ అని అన్నారు.

ఇవీ చదవండి:

ఓరినాయనో.. బిగ్‌బాస్ హౌస్‌ లోకి వెళ్తున్నది వీళ్ళే.. ఇక రచ్చ రచ్చే..

తనకు పుట్టిన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలున్నాయని తెలిసి తల్లడిల్లిపోయిన స్టార్ హీరోయిన్..

క‌ళ్యాణ్ రామ్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’ రిలీజ్ డేట్

మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రామ్ చరణ్ క్లాస్‌మేట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

Sootiga Team

Recent Posts

RTV ఆఫీసుపై ఈడీ దాడులు!!

RTV ఛానల్ ఆది నుంచి చిక్కుల్లోనే మునిగి తేలుతోంది..! ఇప్పటికే ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్న ఈ ఛానల్ ఏపీ, తెలంగాణ…

June 29, 2024

విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారే!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకున్నా, అది కూడా…

June 29, 2024

చిప్ప కూడు తింటున్నా.. పవిత్ర పొగరు తగ్గలేదే..!

కన్నడ హీరో దర్శన్.. ఆయన లవర్ పవిత్ర ఇద్దరూ హత్య కేసులో ఊచలు లెక్క పెడుతున్న సంగతి తెలిసిందే. ఐతే…

June 29, 2024

బాబోయ్.. ‘కల్కి’ మూవీకి తొలిరోజే ఇన్ని కోట్లా..?

టాలీవుడ్ నుంచి సరైన సినిమా వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు కారం తర్వాత అంత పెద్ద…

June 28, 2024

Kalki 2898AD Review: ప్రభాస్ కల్కి మూవీ రివ్యూ.. పోలా ఆదిరిపోలా!

అవును..'కల్కి' న భూతో.. న భవిష్యత్.. రోమాలు నిక్కపొడిచే సన్నివేశాల చిత్రం! ప్రపంచ ఖ్యాతి అర్హత ఉన్న ప్రశంస వర్షాల…

June 27, 2024

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో…

June 26, 2024