ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

ఇద్దరు బడా హీరోలు తలపడితే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ సినిమా హిట్ అవుతుంది? ఏది ఫట్ అవుతుంది? లేదంటే ఏ సినిమా ఎన్ని కోట్లు సాధించింది? హాట్ టాపిక్ అయిపోతాయి. ఆ హీరోలకు టెన్షన్ ఉంటుందో ఉండదో కానీ వాళ్ల ఫ్యాన్స్‌కి మాత్రం నరాలు తెగే టెన్షన్ ఉంటుంది. వచ్చే వేసవికి ఇదే జరగబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి తలపడబోతున్నారు. 

క్రేజీ కాంబో కదా.. ఈ ఇద్దరూ తలపడితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పటికే ఆసక్తికరంగా మారింది. దేవర, పుష్ప 2 వేసవిలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయట. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్నాడు. ఇక బన్నీ వచ్చేసి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్నాడు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న దేవర మూవీ అనుకున్న సమయానికి పక్కా విడుదలవుతుందట.

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఊర మాస్ గెటప్‌లో చేస్తున్న సినిమా కావడం గమనార్హం. ఇక అటు అల్లు అర్జున్ కూడా ఊర మాస్ గెటప్‌లో చేస్తున్న సినిమా పుష్ప 2. బన్నీ కూడా సమ్మర్‌ను టార్గెట్ చేయబోతున్నాడు. ఇక పార్ట్ 1ను మించి ఉండేలా పార్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికోసం నిర్మాతలు సైతం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. ఇక ఈ వేసవికి సినీ ప్రియులకు పండగే..

ఇవీ చదవండి:

మహేష్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న రాజమౌళి

ఆసుపత్రి పాలైన ఆదాశర్మ

‘బ్రో’ని తొక్కేస్తున్న బేబి.. ఇంకా ఆగని కలెక్షన్ల సునామీ

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇటలీలో ఎందుకు? ఏ సంప్రదాయంలో వివాహం జరగబోతోందో తెలుసా?

నిహారికతో పెళ్లి వార్తలపై తరుణ్ ఏం చెప్పాడంటే..

ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ

Google News