కార్తీ ‘జపాన్’ చిత్రం షాకింగ్ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్

కార్తీ ‘జపాన్’ చిత్రం షాకింగ్ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్

స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా కూడా తనకంటూ సొంత ఇమేజ్‌ను సంపాదించుకుని తాను కూడా ఓ స్టార్ హీరోగా ఎదిగాడు కార్తీ. ఇప్పటి వరకూ 24 చిత్రాల్లో నటించగా.. వాటిలో 90 శాతం సినిమాలు హిట్ కావడం విశేషం. ఇటీవల చేసిన సినిమాలన్నీ హిట్టే. దీంతో హ్యాట్రిక్ హీరోగా మారిపోయాడు. ఇక ప్రస్తుతం కార్తీ నటించిన ‘జపాన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

నిజానికి టైటిలే చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఈ టైటిల్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజు మురుగన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ‘జపాన్’ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. కార్తీ గెటప్పులు సైతం ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చిత్ర ప్రి రిలీజ్ బిజినెస్ బీభత్సంగా జరిగింది.

Advertisement
కార్తీ ‘జపాన్’ చిత్రం షాకింగ్ స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్

జపాన్ చిత్ర ప్రి రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జపాన్‌ చిత్ర ప్రీ బిజినెస్‌ మాత్రమే రూ.150 కోట్లు జరిగిందని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ రేంజ్‌లో వ్యాపారం జరిగిన మూవీ కార్తీ కెరీర్‌లోనే లేకపోవడం విశేషం. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని తర్వాత కార్తీ తన 26వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నలన్‌ కుమార సామి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్

మహేష్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్న రాజమౌళి

ఆసుపత్రి పాలైన ఆదాశర్మ

‘బ్రో’ని తొక్కేస్తున్న బేబి.. ఇంకా ఆగని కలెక్షన్ల సునామీ

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇటలీలో ఎందుకు? ఏ సంప్రదాయంలో వివాహం జరగబోతోందో తెలుసా?