వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇటలీలో ఎందుకు? ఏ సంప్రదాయంలో వివాహం జరగబోతోందో తెలుసా?

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఇటలీలో ఎందుకు? ఏ సంప్రదాయంలో వివాహం జరగబోతోందో తెలుసా?

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోనే పెళ్లి ఉంటుందన్న టాక్ బలంగానే వినిపిస్తోంది. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న జంట పెళ్లి ఎక్కడ చేసుకోవాలో కూడా డిసైడ్ చేసుకున్నారు. ఇటలీలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే ఈ జంట ఇటలీలోనే వివాహం చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక ఏ సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరగనుందనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్, లావణ్యల ప్రేమ ఇటలీలోనే ప్రారంభమైందట. అందుకే ఇటలీని ఎంచుకున్నారట. ఇక లావణ్య త్రిపాఠిది రాజవంశమట. కాబట్టి రాచరిక సంప్రదాయంలో వీరిద్దరి వివాహం జరగనుందని టాక్. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి కేవలం 50 మంది సమక్షంలో వరుణ్, లావణ్యల పెళ్లి జరగనుందట.

Varun Tej, Lavanya Tripathi Wedding

అయితే.. వివాహమైన వారం రోజుల తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారట. నిజానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజం కూడా కావొచ్చు. ఏది ఏమైనా వివాహం జరిగితే కానీ క్లారిటీ రాదు. ఇక లావణ్య, వరుణ్ తేజ్‌లు గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారట. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ టాక్ నడుస్తున్నా ఇద్దరూ కొట్టిపారేయడంతో అంతా సైలెంట్ అయిపోయారు.

ఇవీ చదవండి:

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక యంగ్ హీరో మృతి.. వెల్లువెత్తుతున్న నివాళులు

ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ

యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

సుమన్‌పై ఆరోపణలు, అరెస్ట్ వెనుక ఆ ముగ్గురు..!

ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..

Google News