‘బ్రో’ని తొక్కేస్తున్న బేబి.. ఇంకా ఆగని కలెక్షన్ల సునామీ

'బ్రో'ని తొక్కేస్తున్న బేబి.. ఇంకా ఆగని కలెక్షన్ల సునామీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌తోనే నడుస్తోంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగులు ఈ సినిమాకు హైలైట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక బేబి సినిమా విడుదలై దాదాపు మూడు వారాలవుతోంది.

బ్రో సినిమా అంటే స్టార్ హీరో పవన్ కల్యాణ్ మూవీ. నిజానికి పవన్ సినిమా విడుదలైతే చిన్న సినిమాలన్నీ దుకాణం సర్దేయాలి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఒక చిన్న సినిమా ధాటికి అది కూడా మూడు వారాల క్రితం విడుదలైన సినిమా ధాటికి బ్రో మూవీ ఆశించిన రీతిలో కలెక్షన్లు, ఆదరణ, జనాలు థియేటర్ కి వచ్చి చూసే పరిస్థితి లేక.. బేబీ ముందు చిగురుటాకులా వణికిపోతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. బేబి మూవీ కోసం కొన్ని చోట్ల బ్రో సినిమాని నిలిపివేయడం ఆసక్తికరంగా మారింది.

Baby movie

బ్రో సినిమాకు ఓపెనింగ్స్ మాత్రమే అదిరిపోయాయి. అయితే ఆ తరువాత సినిమా కలెక్షన్స్ క్రమక్రమంగా డ్రాప్ అయ్యాయని సమాచారం. కానీ బేబి సినిమా గత నెల 14న విడుదలైంది. అప్పటి నుంచి కూడా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. దీంతో థియేటర్స్ యాజమాన్యం బ్రో మూవీని తీసేసి బేబి సినిమాను కంటిన్యూ చేస్తున్నారట. కనీసం హీరో, హీరోయిన్లు పెద్దగా ఎవరికీ తెలియదు. అలాంటిది అంతటి స్టార్ డమ్ ఉన్న హీరోలు చేసినా సినిమాను గడగడలాడించడం ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి:

ఎదపై టాటూ.. చేతిలో మందు గ్లాస్‌తో రచ్చ రచ్చ చేస్తున్న అనసూయ

యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

సుమన్‌పై ఆరోపణలు, అరెస్ట్ వెనుక ఆ ముగ్గురు..!

ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..

‘బ్రో’ను ఓ రేంజ్‌కు వెళ్లకుండా ఆపిన అంశాలివే.. లేదంటేనా?