సుమన్‌పై ఆరోపణలు, అరెస్ట్ వెనుక ఆ ముగ్గురు..!

సుమన్‌పై ఆరోపణలు, అరెస్ట్ వెనుక ఆ ముగ్గురు..!

సీనియర్ సుమన్.. నాటి తరం నుంచి నేటి తరం వరకూ అందరికీ తెలిసిన నటుడు. ఒకప్పుడు బహుభాషా హీరోగా ఒక వెలుగు వెలిగాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. నీలి చిత్రాలను సుమన్‌ తీసినట్లు వచ్చిన ఆరోపణలతో అరెస్ట్, జైలు జీవితమే కాదు.. కెరీర్‌ను సైతం కోల్పోవాల్సి వచ్చింది. అసలు ఆయన ఆరోపణలు, అరెస్ట్ వెనుక కారకులు ఎవరనేది ఇప్పటికీ తెలియదు. 

మెగాస్టార్‌ చిరంజీవి కారణంగానే ఇదంతా జరిగిందని ప్రచారం జరిగింది కానీ అందులో నిజం లేదని సుమన్‌ బహిరంగంగానే పలుమార్లు చెప్పాడు. అయితే ఇన్నాళ్లకు అసలు విషయం బయటకు వచ్చింది. దివంగత సీనియర్‌ దర్శకులు సాగర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్‌ అవుతున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌, అప్పట్లో తమిళనాడులో పనిచేస్తున్న డీజీపీ, ఒక లిక్కర్‌ కాంట్రాక్టర్‌ (వడియార్‌) వీళ్ల ముగ్గురి వల్లే సుమన్‌ జైలుకు వెళ్లాడని ఆయన చెప్పారు. 

సుమన్ ఫ్రెండ్ ఒకరు సదరు లిక్కర్ కాంట్రాక్టర్ కూతురిని ప్రేమించడం.. అలాగే.. రాష్ట్ర డీజీపీ కూతురు సుమన్‌ని అమితంగా ప్రేమించడం వల్లే ఇది జరిగిందని సాగర్ వెల్లడించారు. నిజానికి సుమన్‌కి అసలు ఆ అమ్మాయంటే ఇష్టం లేదట. డీజీపీ ఈ విషయాన్ని మరో రకంగా ఎంజీఆర్‌కు చెప్పడం.. కాంట్రాక్టర్ కూతురి వ్యవహారం వంటి విషయాలు సుమన్‌ను ఇబ్బందులకు గురి చేశాయట. సుమన్‌ను ఎంజీఆర్ ఓ రోజు ఇంటికి పిలిచి డీజీపీ కూతురికి దూరంగా ఉండాలని సూచించారట. కానీ ఆ విషయం తనకి కాదని ఆ అమ్మాయికి చెప్పాలని అన్నారట. దీంతో ఎంజీఆర్‌కు చాలా కోపం వచ్చింది. అంతే ఆయనపై ఆరోపణలు.. నడిరోడ్డుపై అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయట.

ఇవీ చదవండి:

ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్..

‘బ్రో’ను ఓ రేంజ్‌కు వెళ్లకుండా ఆపిన అంశాలివే.. లేదంటేనా?

‘బ్రో’ మూవీ క్రెడిట్ ఎవరిది? పవన్‌దా లేదంటే సాయి ధరమ్‌దా?

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు విజయం ఎలా సాధ్యమైందంటే..

75 ఏళ్ల వృద్ధుడికి వలవేసిన సీరియల్ నటి.. బట్టలన్నీ విప్పించి.. ఫోటోలు తీయించి.. ఆపై..

సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..