75 ఏళ్ల వృద్ధుడికి వలవేసిన సీరియల్ నటి.. బట్టలన్నీ విప్పించి.. ఫోటోలు తీయించి.. ఆపై..

75 ఏళ్ల వృద్ధుడికి వలవేసిన సీరియల్ నటి.. బట్టలన్నీ విప్పించి.. ఫోటోలు తీయించి.. ఆపై..

అందమైన సీరియల్ నటి.. తన అందాన్ని అవకాశాలు అందుకోవడం కోసం వాడలేదు. ఒక వృద్ధుడిని ఏమార్చి డబ్బు గుంజడానికి వాడేసి అడ్డంగా బుక్ అయిపోయింది. కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి (32) మలయాళ టీవీ సీరియల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ డబ్బు ఆశతో ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బినుతో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే ఆర్మీ రిటైర్ ఉద్యోగి అయిన 75 ఏళ్ల వృద్ధుడికి బినుతో కలిసి నిత్య వల వేసింది

నిత్య సీరియల్ నటి మాత్రమే కాదు.. న్యాయవాది కూడా. ఇటీవల తనకు ఉండేందుకు ఇల్లు అద్దెకు కావాలంటూ ఓ వృద్ధుడిని సంప్రదించింది. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడితో పరిచయం పెంచుకుని నిత్యం కాల్స్ చేస్తూ స్నేహం పెంచుకుంది. ఈ క్రమంలోనే సదరు వృద్ధుడిని ఒక ఫైన్ మార్నింగ్ కలకోటేలోని తన అద్దె ఇంటికి రావాలని ఆహ్వానించింది. నిత్య ఆహ్వానాన్ని మన్నించి వృద్ధుడు కూడా ఆమె ఇంటికి వెళ్లాడు.

Advertisement

నిత్య ఇంటికి వెళ్లగానే ఆ వృద్ధుడిని మాటల్లో పెట్టి దుస్తులన్నీ తొలగించి.. తాను కూడా దుస్తులు విప్పేసి.. తన స్నేహితుడు బిను సాయంతో ఫోటోలు తీయించుకుంది. ఇక బ్లాక్ మెయిల్ స్టార్ట్. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేదంటే ఫోటోలను సోషల్‌ మీడియాలో పెడతామని వారిద్దరు బెదిరింపులకు దిగారు. రూ.11 లక్షలు ఇచ్చాడు వృద్ధుడు. కానీ ఆశ చావక రూ. 25 లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచన మేరకు వృద్ధుడు డబ్బు ఇస్తానని చెప్పి నిత్య, బినులను తన ఇంటికి ఆహ్వానించాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

చాలా కాలం తర్వాత బుల్లితెరపై దర్శనమిచ్చిన చలాకీ చంటి.. ఎలా ఉన్నాడంటే..

బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

‘బిగ్‌బాస్ 6’ తెలుగు ఫేం కీర్తి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..