ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు దర్శనమివ్వడం షాకింగ్‌ మారింది. కేవలం తన సినిమాల రిలీజ్ లేదంటే మరేదైనా ఈవెంట్‌ కోసం మాత్రమే ప్రభాస్ బయటకు వస్తుంటాడు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆయన అసలు కనిపించడమే చాలా కష్టం. ఎప్పుడైనా తన సినిమా అప్‌డేట్స్ మాత్రం పోస్ట్ చేస్తుంటాడు. అంతకు మించి పెద్దగా కనిపించడు. అలాంటి ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు దర్శనమిచ్చాయి. 

అవి రెండూ ఫన్నీ వీడియోలు కావడం విశేషం. అసలు పోస్టే పెట్టని ప్రభాస్ అకౌంట్‌లో అన్ లక్కీ హ్యూమన్స్, బాల్స్ పెయిల్స్ అరౌండ్ ది వరల్డ్ అనే క్యాప్షన్ తో ఫన్నీ వీడియోలు దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియోలు చూసిన అభిమానులు తొలుత షాక్ అయ్యారు. ఆ తరువాత ఒకింత ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం చాలా సింపుల్. ప్రభాస్ ఇలాంటి వీడియోలు షేర్ చేయరు కాబట్టి ఆయన అకౌంట్ హ్యాక్ అయ్యుంటుందనే అనుమానం.

Advertisement
ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ఇక ఈ వీడియోలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. తన అకౌంట్ హ్యాక్‌కి గురైతే ఆయన తప్పక స్పందించి ఉండేవారని కాబట్టి ఏదో మూడ్‌లో ఉండి ఆయనే పోస్ట్ చేసి ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరికొందరు మాత్రం తప్పక హ్యాక్ అయి ఉంటుందని ఫీల్ అవుతున్నారు. అయితే నిజంగానే ప్రరభాస్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. దీనిపై స్పందించిన ప్రభాస్.. తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. టీమ్ సెట్ చేసే పనిలో ఉన్నారంటూ ఓ సందేశం విడుదల చేశారు.

ఇవీ చదవండి:

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..

BRO Twitter Review: ‘బ్రో’ ట్విటర్ రివ్యూ: ఆ సన్నివేశాలు హైలైట్

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7పై కేసు.. దీనిలో నిజమెంత?

అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..