BRO Twitter Review: ‘బ్రో’ ట్విటర్ రివ్యూ: ఆ సన్నివేశాలు హైలైట్

‘బ్రో’ ట్విటర్ రివ్యూ ఎలా ఉందంటే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. వినోదయ సిత్తాయం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ఇప్పటికే పడిపోయాయి. తమిళ్‌లో అయితే మంచి కంటెంట్‌తో వచ్చి తమిళ్‌లో ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. 

మరి తెలుగులో ఈ చిత్రం ఎలా ఉందనేది ఇప్పటికే నెటిజన్లు ట్విటర్‌లో రివ్యూ ఇస్తున్నారు. అసలు సినిమా ఎలా ఉంది..? కథ.. కథనం నడిపించిన తీరు సక్సెస్ వైపు తీసుకెళుతుందా? ఈ సినిమా తెలుగు వారిని ఏ మేరకు ఆకట్టుకోగలదు వంటి అంశాలను సోషల్ మీడియాలో కొందరు ప్రేక్షకులు అందిస్తున్నారు. అయితే ఒరిజినల్‌తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారట. ఇక సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్ కొంతమేర చాలా స్లోగా ఉందట.

Bro Teaser: ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో టీజర్.. ఎన్ని వ్యూస్ రాబట్టిందో తెలిస్తే..

ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాక మూవీకి ఫుల్ ఎనర్జీ వస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. ఇంటర్వల్ పోర్షన్ పర్వాలేదని.. ఇక సెకండ్ హాఫ్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యింది అని చెబుతున్నారు. సింగిల్ లైన్ పై కథ వెళ్లడంతో సినిమా కాస్త బోరింగ్‌గా అనిపిస్తోందన్నారు.

పవన్ కల్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ అట. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ట్ వర్క్ బాగుందనేది ఇప్పటి వరకూ వచ్చిన టాక్.

ఇవీ చదవండి:

తమన్నా పై ఫైర్ అయిన అల్లు అర్జున్ భార్య

సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకుని మరోసారి దొరికిపోయిన రష్మిక మందన్నా

అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7పై కేసు.. దీనిలో నిజమెంత?

Google News