సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

సాయి ధరమ్ తేజ్ అంటే పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌కి ఎంత ప్రేమ అనేది ఇటీవలి కాలంలోనే తెలుస్తూ వస్తోంది. సాయి ధరమ్‌కు యాక్సిడెంట్ అయిన సమయంలో హుటాహుటిన పవన్ ఆసుపత్రికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆ సమయంలోనే ఆయనకు అల్లుడంటే ఎంత ప్రేమో బయటి ప్రపంచానికి తెలిసింది. తన సోదరి విడాకుల అనంతరం సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్‌లను పవనే చూసుకున్నాడని సమాచారం.

తనే అన్నదమ్ములిద్దరి అవసరాలు చూసుకున్నారట. అందుకే సాయి ధరమ్‌పై పవన్‌కు అమితమైన ప్రేమట. ఇక అల్లుడిపై పవన్ ప్రేమకు బ్రో ప్రి రిలీజ్ ఫంక్షన్ మరోసారి వేదికగా నిలిచింది. నిజానికి బ్రో సినిమాలో పవన్ పాత్ర చాలా కీలకమైనప్పటికీ నిడివి మాత్రం పెద్దగా ఉండదట. సినిమా మొత్తం సాయి ధరమ్ చుట్టూనే తిరుగుతుందట. కానీ పవన్ కారణంగానే సినిమాకు బీభత్సమైన హైప్ వచ్చిందనేది మాత్రం జగద్విదితం.

సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

బ్రో రిలీజ్ ఈవెంట్ మీద సాయిధరమ్ తేజ్ ఎప్పటి నుంచో కోరుతున్న ఓ కోరికను తీర్చాడు పవన్ కళ్యాణ్. తనకు ఒక ఖరీదైన చైన్ కావాలని ఎప్పుడో పవన్‌ను సాయి ధరమ్ కోరాడట. తనకు తన మామయ్య గుర్తుగా అది కావాలని అడిగేవాడ. ఇక బ్రో సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో వేదికపై సాయి ధరమ్‌కి ఒక చైన్‌ను బహుమతిగా ఇచ్చి పవన్ సర్‌ప్రైజ్ చేశారు. దానిని చూసిన సాయి ధరమ్ చాలా ఆనందంతో మెడలో వేసుకున్నాడు. ఇక ఫ్యాన్స్ ఈలలు వేస్తూ రచ్చ రచ్చ చేశారు.

ఇవీ చదవండి:

పోటీగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌ని నాశనం చేశారంటూ దిల్ రాజుపై సి.కల్యాణ్ ఫైర్

నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!

యాంకర్ ప్రదీప్‌కి కాబోయే భార్య ఆమేనట.. ఫోటో లీక్ చేసిన సీరియల్ నటి!

అమెరికాలోని ఓ మ్యూజిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనసూయ

బిగ్‌బాస్ తెలుగుకి కంటెస్టెంట్స్ కరువు!

Google News