యాంకర్ ప్రదీప్‌కి కాబోయే భార్య ఆమేనట.. ఫోటో లీక్ చేసిన సీరియల్ నటి!

యాంకర్ ప్రదీప్‌కి కాబోయే భార్య ఆమేనట.. ఫోటో లీక్ చేసిన సీరియల్ నటి!

మేల్ యాంకర్స్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. కానీ ప్రదీప్ మాచిరాజు మాత్రం తనకు తానే సాటి.. తనకెవరూ లేరు పోటీ అన్నట్టుగా అయిపోయాడు. ప్రదీప్ ఎక్కడున్నా సందడే సందడి. వెండితెరపై పెద్దగా రాణించలేకపోయిన ప్రదీప్.. బుల్లితెరపై మాత్రం అన్ని విధాలుగా రాణిస్తున్నాడు. యాంకర్‌గా.. నిర్మాతగా తనదైన మార్క్ వేసుకున్నాడు. ఇక ప్రదీప్ ఏ షో చేసినా కూడా కామన్‌గా వచ్చే టాపిక్ పెళ్లి.

గతంలో ప్రదీప్ హౌస్ట్ గా పెళ్లిచూపులు అనే షో నడిచింది. నిజానికి ఇది ప్రదీప్ స్వయంవరం అన్నట్టుగా నడిచింది. కానీ ఈ షో భారీ నష్టాలపాలవడంతో మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఈ షోలో ఎవరో ఒకరిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారు కానీ అదీ జరగలేదు. తాజాగా జీ తెలుగు లో ‘సూపర్ క్వీన్ 2’ పేరుతో ఒక ప్రోగ్రాం నడుస్తోంది. ఈ షోలో కూడా యాంకర్ ప్రదీప్ పెళ్లి టాపిక్ వచ్చింది.

Anchor Pradeep Machiraju

ఈ షోలో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె మాట్లాడుతూ గతంలో ఏదో స్వయంవరం పేరుతో ఒక షో చేశావు కదా ఇది కూడా అలాంటిదేనా? అని ప్రశ్నించగా.. ఆ షోకి సంబంధించి ఎప్పుడో సామాన్లు సర్దేశామని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ షోలో సీరియల్ నటి వచ్చి తన తరుఫున ప్రదీప్‌కు ఒక చిన్న బహుమతి అని ఓ ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. ఇక ఈ ఫోటో ఫ్రేమ్‌లో ఉన్నది ప్రదీప్‌కి కాబోయే భార్య అని టాక్. మరి నిజంగా ప్రదీప్‌కి కాబోయే భార్య ఫోటో యేనా? కాదో ఆ ఎపిసోడ్ ప్రసారమైతే కానీ తెలియదు.

ఇవీ చదవండి:

అమెరికాలోని ఓ మ్యూజిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనసూయ

అమ్మకు బాగోలేదని.. ఆ డబ్బుతో కారు కొన్నావా? ముక్కు అవినాష్‌పై నెటిజన్లు ఫైర్

బిగ్‌బాస్ తెలుగుకి కంటెస్టెంట్స్ కరువు!

‘గుంటూరు కారం’ సినిమా నుంచి తమన్ ఔట్?

హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌

జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు!

Google News