Gandeevadhari Arjuna Teaser: హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌

Gandeevadhari Arjuna Teaser: హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌ 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలైతే బీభత్సంగానే ఉన్నాయి.

హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌ 

ఇటు ప్రవీణ్ సత్తారు.. అటు మెగా ప్రిన్స్‌ ఈ సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. దీనికి ముందు ఇద్దరి సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో చాలా గ్యాప్ తీసుకుని మరీ వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ఆశాజనకంగానే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్.. మూవీపై మరిన్ని అంచనాలను పెంచేసేలాగే ఉంది.

Gandeevadhari Arjuna Teaser: హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌ 

గతంలో విడుదలైన ప్రి టీజర్‏లో ఓ రేంజ్ యాక్షన్ స్టంట్స్‌ను మేకర్స్ చూపించారు. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్‏ మొత్తం దాదాపు యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. హాలీవుడ్ మూవీని తలపించే రీతిలో అండర్ కవర్ ఆపరేషన్స్, అదిరిపోయే స్టంట్స్‏, హీరోయిన్‌తో రొమాన్స్ వంటి అంశాలతో మొత్తానికి ఒక హైప్ అయితే క్రియేట్ అయ్యింది. మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

Indian 2: ‘ఇండియన్ 2’ నుంచి ఆసక్తికర అప్‌డేట్.. వైరల్ అవుతున్న శంకర్ పోస్ట్

RRR in Japan: జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు!

Ram Charan: రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ ఆసక్తికర న్యూస్ వైరల్

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

సితార.. తండ్రి మహేష్ ను మించిపోయిందిగా..!

కల్కి.. టీజర్ అదుర్స్.. కానీ రాజమౌళి ఏంటి అలాంటి ప్రశ్న వేశారు?

Google News