కల్కి.. టీజర్ అదుర్స్.. కానీ రాజమౌళి ఏంటి అలాంటి ప్రశ్న వేశారు?

కల్కి.. టీజర్ అదుర్స్.. కానీ రాజమౌళి ఏంటి అలాంటి ప్రశ్న వేశారు?

హమ్మయ్యా.. ఎట్టకేలకు ప్రాజెక్ట్ కె.. టైటిల్, మూవీ టీజర్ ఏకకాలంలో వచ్చేశాయి. ఇక ఈ టీజర్ అంచనాలను అందుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. టీజర్ చూస్తున్నంత సేపూ ఏదో హాలీవుడ్ యాక్షన్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే జనాలకు కలిగింది. ప్రభాస్ లుక్ అద్భుతం. ఇక తమిళ నటుడు పశుపతి టీజర్‌లో కనిపించి షాక్ ఇచ్చాడు. అతనొకడు సినిమాలో ఉన్నాడన్న విషయమే ప్రేక్షకులకు తెలియదు. 

అమితాబ్ రోల్ కూడా హైలైట్‌గా ఉంది. దీపిక లుక్ అదిరిపోయింది. మొత్తానికి దర్శకుడు నాగ్ అశ్విన్ మెస్మరైజ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలైతే ఓ రేంజ్‌లో పెరిగాయి. తాజాగా కల్కి టీజర్‌పై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. ఇప్పుడు రాజమౌళి కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. కల్కి చిత్ర రిలీజ్ డేట్‌ ఎప్పుడని ఆయన ప్రశ్నించారు. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. అయినా కూడా రాజమౌళి అలా అడగటమేంటి?

Kalki teaser

నిజంగా రాజమౌళికి రిలీజ్ డేట్ తెలియదా? అసలు రాజమౌళి ఏమన్నారంటే.. దర్శకుడు నాగి, నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఏదో వండర్ చేసిందన్నారు. ఫ్యూచరిస్టిక్ చిత్రాన్ని ఇంత ఉన్నతంగా రూపొందించడమంటే సాధారణ విషయం కాదన్నారు. మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని ప్రశంసించారు. ప్రభాస్ లుక్ మైండ్ బ్లాంక్ చేసింది కానీ ఒకటే సందేహం.. మూవీ విడుదల ఎప్పుడని రాజమౌళి ప్రశ్నించారు. విడుదల తేదీపై అధికారిక ప్రకటన తేదీ వచ్చాక కూడా ఆయన ఇలా ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. అసలెందుకు రాజమౌళి అలా అడిగారనేది.. హాట్ టాపిక్‌గా మారింది.

ఇవీ చదవండి:

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్

ఒక్కరోజైనా ఆ స్టార్ హీరోతో డేట్ కు వెళతానంటున్న శ్రీముఖి

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన బన్నీ

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన ‘ప్రేమదేశం’ అబ్బాస్

పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

Google News