Allu Arjun: పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన బన్నీ

Allu Arjun: తన డైలాగ్‌ను తానే లీక్ చేసిన బన్నీ

మెగాస్టార్ చిరంజీవి.. లీకులు ఇవ్వడంలో దిట్ట. పొరపాటునో కావాలనే ఇస్తారో కానీ మొత్తానికి కొన్ని లీక్స్ అయితే మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల విషయంలో ఇస్తూ వస్తున్నారు. ఆచార్య మూవీ టైటిల్ కూడా అలాగే ఇచ్చేశారు. ఇప్పుడు మామయ్య బాటలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నడుస్తున్నాడు. తన పుష్ప 2లోని డైలాగ్‌ను తానే లీక్ చేశాడు. ఇప్పుడు ఆ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అతి చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతోదుమ్ము రేపే వసూళ్లతో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ తాజాగా జరిగింది. ఈ సక్సెస్ మీట్‌కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు.

Allu Arjun: తన డైలాగ్‌ను తానే లీక్ చేసిన బన్నీ

ఈ సందర్భంగా బన్నీ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. అనంతరం అక్కడికి వచ్చిన వాళ్లంతా పుష్ప 2 నుంచి ఏదైనా డైలాగ్ చెప్పాలని బన్నీని కోరారు. అప్పుడు బన్నీ.. ‘‘డైలాగా?.. అమ్మో ఇది చిరు లీక్స్ కంటే డేంజర్‌గా ఉంది. ‘ఈ సినిమా పేరు పుష్ప 2 : ది రూల్ , కానీ ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ జరిగేది మొత్తం ఒక రూల్ ప్రకారం జరుగుతున్నాది, అదే పుష్ప గాడి రూల్’ అని చెప్పాడు. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవీ చదవండి:

ప్రాజెక్ట్ కె.. ఒక్క టీజర్‌తో రఫ్పాడించారు

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన ‘ప్రేమదేశం’ అబ్బాస్

పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఎవడురా ఫోటోషాప్ చేసిందంటూ.. నెటిజెన్ల ఫైర్

హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష

బిగ్‌బాస్ సీజన్ -7 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది..

Google News