Pooja Hegde: పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

Pooja Hegde: పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

నిత్యం వార్తల్లో ఉండాలంటే కొందరు ఎంచుకునే మార్గం.. ఏదో ఒక సంచలనం క్రియేట్ చేయడం. ఓవర్ సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ఇలాంటి సంచలనాలకు ఎప్పుడూ తెరదీస్తూనే ఉంటారు. తద్వారా ఆయనకు వచ్చేదేం లేదు కానీ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. దీనికోసం ఎంతకైనా దిగజారేందుకు వెనుకాడరు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవతోంది. 

హీరోయిన్ పూజ హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందని.. కుటుంబ సభ్యులు సరైన సమయానికి గమనించి రక్షించారంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. నిజానికి ప్రస్తుతం పూజా మెగ్డే కెరీర్ పూర్తిగా నెమ్మదించింది. ఆమె చేతిలో ఉన్న సినిమాలు సైతం చేజారి పోయాయి. మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ నుంచి పూజా తప్పుకుంది. దీనికి కారణం ఏంటంటే.. ఆమెను మెయిన్ రోల్ నుంచి తప్పించేశారట.

Pooja Hegde

శ్రీలీలను మెయిన్ రోల్ చేయడంతో హర్ట్ అయిపోయి పూజా తప్పుకుందట. ఇక ‘జనగణమన’ మూవీ ఆదిలోనే నిర్మాతలు తప్పుకోవడంతో ఆగిపోయింది. మొత్తానికి వరుస ఫ్లాప్స్ తర్వాత పూజా హెగ్డేకు సినిమాలేమీ రావడం లేదన్నది అక్షర సత్యం. దీనిని అడ్డుగా పెట్టుకుని ఏకంగా ఆత్మహత్యకు యత్నించిందంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేయడంపై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఉమైర్ సంధు ట్వీట్‌లో అయితే ఏమాత్రం నిజం లేదు.

ఇవీ చదవండి:

‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఎవడురా ఫోటోషాప్ చేసిందంటూ.. నెటిజెన్ల ఫైర్

హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష

బిగ్‌బాస్ సీజన్ -7 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది..

వామ్మో.. సురేఖావాణి కూతురేంటి బీచ్‌లో ఇంతలా రెచ్చిపోయింది

పవన్ సెట్లో అడుగుపెడితే ఏదో అనుభూతి… అది మాటల్లో చెప్పలేము: ప్రియా ప్రకాష్ వారియర్

Google News