Bigg Boss Telugu 7 Promo: బిగ్‌బాస్ సీజన్ -7 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది..

Bigg Boss Telugu 7 Promo: బిగ్‌బాస్ సీజన్ -7 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది..

బిగ్‌బాస్ రియాలిటీ షోకి భాషలతో సంబంధం లేకుండా విపరీతమైన ఆదరణ ఉంది. హిందీలో గ్రాండ్ సక్సెస్ అవడంతో ఇతర భాషల్లోనూ ఈ షో అందుబాటులోకి వచ్చింది. ఇక తెలుగులో తొలి షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీంతో దీనిని నిర్వాహకులు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగులో ప్రారంభమైంది. తొలి సీజన్‌లో బాగా తెలిసిన సెలబ్రిటీలు కంటెస్టెంట్‌లుగా ఉన్నారు.

దీంతో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక సీజన్ 2 కూడా తెలిసిన వారే ఉండటంతో ఈ సీజన్ కూడా అద్భుతంగా పేలింది. ఇక ఆ తరువాతి సీజన్స్ మాత్రం తొలి రెండు సీజన్లంత సత్ఫలితాన్ని ఇవ్వలేదు కానీ అట్టర్ ఫ్లాప్ అయితే కాలేదు. ఇక రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక ఆ తరువాత నుంచి నాగార్జున హోస్టింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా నాగే హోస్టింగ్ చేస్తున్నారు.

తాజాగా బిగ్‌బాస్ సీజన్ 7కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈసారి అంతా ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటున్నారు. మొత్తానికి ఏదో కొత్త కాన్సెప్ట్‌తోనే వస్తున్నట్టుగా కనిపిస్తోంది. సీజన్ 6 పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈసారి సరికొత్తగా సీజన్ 7ను అందుబాటులోకి తెస్తున్నట్టు టాక్. గత సీజన్ తప్పిదాలను రిపీట్ చేయకుండా ఉంటే చాలని ఆడియన్స్ అంటున్నారు. మొత్తానికి బిగ్‌బాస్ 7 త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనుంది.

ఇవీ చదవండి:

వామ్మో.. సురేఖావాణి కూతురేంటి బీచ్‌లో ఇంతలా రెచ్చిపోయింది

పవన్ సెట్లో అడుగుపెడితే ఏదో అనుభూతి… అది మాటల్లో చెప్పలేము: ప్రియా ప్రకాష్ వారియర్

‘జ‌వాన్’ న‌య‌న‌తార‌ పోస్ట‌ర్ విడుద‌ల‌.. మునుపెప్పుడూ చూడ‌ని లుక్ లో

వామ్మో.. ఆదిపురుష్ ఇంత దారుణంగా దెబ్బతిన్నదా?

స్టార్ హీరో సినిమా విషయమై నోరు జారిన హీరోయిన్.. ఫ్యాన్స్ ఫైర్

Google News