స్టార్ హీరో సినిమా విషయమై నోరు జారిన హీరోయిన్.. ఫ్యాన్స్ ఫైర్

స్టార్ హీరో సినిమా విషయమై నోరు జారిన హీరోయిన్.. ఫ్యాన్స్ ఫైర్

పొరపాటునో.. గ్రహపాటునో ఒక స్టార్ హీరో సినిమా గురించి ఒక ప్రముఖ హీరోయిన్ నోరు జారింది. దీంతో హీరో ఫ్యాన్స్ ఊరుకుంటారా? రచ్చ రచ్చ చేస్తున్నారు. అమ్మడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గత చిత్రం పఠాన్ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. షారుఖ్‌కి దాదాపు దశాబ్దం తర్వాత లభించిన సక్సెస్ ఇది. పైగా వెయ్యి కోట్లు. ఫ్యాన్స్‌కు పట్టపగ్గాల్లేవు.

అంతా బాగానే ఉంది కానీ సినిమా కలెక్షన్స్ వెయ్యి కోట్లు అనేది అంతా హమ్మక్ అని.. అందులో ఏమాత్రం నిజం లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఇదంతా ప్రచారమే నిజానికి కలెక్షన్స్ ఆ స్థాయిలో ఉండకపోవచ్చనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి పఠాన్ మూవీ కలెక్షన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ మాత్రం పఠాన్ కలెక్షన్స్‌పై స్పందించింది.

Pathaan movie

‘ది ట్రయల్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో కాజోల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. దీనిలో పలు ఆసక్తికర విషయాలపై ఆమె స్పిందింది. తనకు మళ్లా షారుఖ్‌తో సినిమా చేయాలని ఉందని తెలిపింది. అయితే షారుఖ్‌ను మీరిప్పుడు కలిస్తే ఏం అడుగుతారని కాజోల్‌ను ప్రశ్నించగా.. పఠాన్ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంతో చెప్పమని అడుతానని తెలిపింది. అంటే చిత్ర యూనిట్ చెప్పేది ఒకరిజినల్ కలెక్షన్స్ కాదనే కదా.. కాజోల్ ఉద్దేశ్యమని పలువురు అంటుండగా.. షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం ఆమెపై బీభత్సంగా ఫైర్ అవుతున్నారు.

ఇవీ చదవండి:

Adipurush: వామ్మో.. ఆదిపురుష్ ఇంత దారుణంగా దెబ్బతిన్నదా?

Anand Deverakonda: పాపం.. బేబీ.. హిట్టయినా రౌడీ తమ్ముడికి నిరాశే !

Samajavaragamana: 3 వారాల్లో ‘సామజవరగమన’ మూవీ ఎంత రాబట్టిందో తెలిస్తే..

Klin Kaara: మెగా వారసురాలు క్లీంకార రూం చూస్తే షాక్ అవుతారు!

Google News