Samajavaragamana: 3 వారాల్లో ‘సామజవరగమన’ మూవీ ఎంత రాబట్టిందో తెలిస్తే..

Samajavaragamana: 3 వారాల్లో ‘సామజవరగమన’ మూవీ ఎంత రాబట్టిందో తెలిస్తే..

ఇటు వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న శ్రీ విష్ణుకి, ‘ఏజెంట్’ చిత్రంతో భారీ నష్టాలను మూటకట్టుకున్న నిర్మాత అనిల్ సుంకరకు ‘సామజవరగమన’ చిత్రం మమూలు రిలీఫ్‌ని ఇవ్వలేదు. ఇక ఇటీవలి కాలంలో చాలా వరకూ ప్రేక్షకులు థియేటర్లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకులు థియేటర్ల వైపు నడిపించిన చిత్రమిది. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు అయ్యింది. 

ఈ మూడు వారాల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లు రాబట్టింది? అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. ఓపెనింగ్స్ పెద్దగా లేపకపోవడంతో ఈ చిత్రంపై అంతా ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా జరిగింది. దీంతో లాంగ్ రన్‌లో దుమ్ము రేపే వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా రూ.3.50 కోట్లకు జరిగింది.

Samajavaragamana: 3 వారాల్లో ‘సామజవరగమన’ మూవీ ఎంత రాబట్టిందో తెలిస్తే..

ఆసక్తికరంగా ఈ మూవీ విడుదల అనంతరం కేవలం నైజాం నుంచే 3 వారాల్లో రూ.5.50 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక సీడెడ్‌లో రూ.1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.75 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.1.31 కోట్లు.. గుంటూరు జిల్లాలో రూ.72 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ. 75 లక్షలు, నెల్లూరు జిల్లాలో రూ.41 లక్షల షేర్‌ను రాబట్టింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లపో రూ.10 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే రూ.14.70 కోట్లను రాబట్టింది.

ఇవీ చదవండి:

‘బేబి’ తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా ?

ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న విశ్వక్ సేన్

Klin Kaara: మెగా వారసురాలు క్లీంకార రూం చూస్తే షాక్ అవుతారు!

Hi Nanna: ‘హాయ్ నాన్న’లో నాని కూతురుగా నటిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా?

ప్రశాంత్ నీల్, చిరు, రామ్ చరణ్.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్

Google News