Hi Nanna: ‘హాయ్ నాన్న’లో నాని కూతురుగా నటిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా?

‘హాయి నాన్న’లో నాని కూతురుగా నటిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా?

చైల్డ్ ఆర్టిస్ట్‌కు ప్రాధాన్యమున్న సినిమా అయితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూ.. ముద్దు ముద్దు మాటలతో అలరిస్తూ ఉంటారు. కనీసం లోకం గురించి పూర్తిగా తెలియకముందే కెమెరా ముందు నిలబడిన వారిలో ఇప్పుడు చాలా మంది హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అప్పట్లో అయితే ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే చిన్నారులు తమ నటనతో ఇరగదీశారు.

తాజాగా బేబీ ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. ఇప్పుడు ఆ బేబీ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నాని హీరోగా రూపొందుతున్న మూవీ ‘హాయ్ నాన్న’. ఈ మూవీలో నాని కూతురిగా ఓ పాప నటిస్తోంది. చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ పాప గురించి తెలుసుకోవడానికి అంతా ప్రయత్నిస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు ఆమె కొత్త కావొచ్చు కానీ హిందీలో మాత్రం ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.

‘హాయ్ నాన్న’.. మాంచి సెంటిమెంట్ టచ్ ఉన్న మూవీగా అనిపిస్తోంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. మూవీ టీం ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ భట్టి చూస్తే పాపకు తల్లి చనిపోతే తండ్రి అయిన నాని అన్నీ తానే అయి పెంచుతాడని తెలుస్తోంది.

ఇక ఈ పాప పేరు కియారా ఖన్నా. పలు యాడ్స్‌లో నటించింది. థాంక్ గాడ్, బందా సింగ్, బారాముల్లా, సాంబహదూర్ వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తెలుగులో కియారాకు ఇదే తొలి సినిమా.

ఇవీ చదవండి:

విజయ్ దేవరకొండ – అనసూయల మధ్య వార్‌పై ఆనంద్ దేవరకొండ

Baby Review: ‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

‘అఖిల్‌తో సినిమా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు!’

పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోష‌న్

సమంత గురించి వైరల్ అవుతున్న న్యూస్ నిజమే.. ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఎమోషనల్ పోస్ట్

Google News