‘అఖిల్‌తో సినిమా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు!’

'అఖిల్‌తో సినిమా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు!'

అక్కినేని అఖిల్ తాను నటించిన ‘ఏజెంట్’ మూవీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో తెలియనిది కాదు. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కూడా. కానీ ఫలితం అఖిల్ నటించిన గత సినిమాలకు ఏమాత్రం భిన్నంగా లేదు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ.7 కోట్ల షేర్‌ని మాత్రమే వసూలు చేసింది. ఈ దెబ్బకు నిర్మాత పని అయిపోయిందని అంతా భావించారు. టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రామ్ ఆచంటకి కెరీర్‌లో ఇంతటి భారీ అపజయం లేదనే చెప్పాలి. దాదాపు ఆయన డీలా పడిపోయిన సమయంలో తాజాగా విడుదలైన చిత్రం ‘సామజవరగమనా’ చిత్రం ప్రాణం పోసింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్‌లో రామ్ ఆచంట మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. రెండు నెలల క్రితం తాను నిర్మించిన ఏజెంట్ చిత్రం భారీ ఫ్లాప్‌గా నిలిచి ఘోరమైన నష్టాలను తెచ్చిపెట్టిందన్నారు.

Advertisement
'అఖిల్‌తో సినిమా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు!'

ఈ సినిమాను నిర్మించడం తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటని తెలిపారు. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యేలోపు అందరూ తన పని అయిపోయిందని అనుకున్నారట. కానీ ఆయనకు దాదాపు ఇండస్ట్రీ అంతా అండగా నిలిచిందట.

ఫోన్లు చేసి చాలా మంది హీరోలు ధైర్యం చెప్పారట. కచ్చితంగా నెక్ట్స్ సినిమాలు బ్లాక్ బస్టర్ కొడతాయని ప్రోత్సహించారని రామ్ తెలిపారు. వాళ్ళందరి ఆశీర్వాదం వల్లే నేడు ‘సామజవరగమన’ ఇంత పెద్ద హిట్ అయ్యిందని రామ్ ఒకింత ఎమోషనల్ అయ్యారు.

ఇవీ చదవండి:

పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోష‌న్

స్టార్ హీరోల సరసన నటించిన ఆ హీరోయిన్‌కు ఎయిడ్స్.. ఆమె విషాద కథ తెలిస్తే..

బన్నీ హీరో ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి వస్తే హీరోని చేసేస్తారా? అన్న అనసూయ..

స్టార్ హీరో విజయ్‌కు ఫైన్.. ఆయన ఏం చేశారంటే ?

మహేష్ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆడేసుకుంటున్నారుగా..