స్టార్ హీరోల సరసన నటించిన ఆ హీరోయిన్‌కు ఎయిడ్స్.. ఆమె విషాద కథ తెలిస్తే..

స్టార్ హీరోల సరసన నటించిన ఆ హీరోయిన్‌కు ఎయిడ్స్.. ఆమె విషాద కథ తెలిస్తే..

సినీ ఇండస్ట్రీ ఒక కలల ప్రపంచం. ఎన్నో ఆశలతో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టి ఆపై దారుణ పరిస్థితులను ఎదుర్కొనే నటులు ఎందరో ఉన్నారు. మాంచి నేమ్, ఫేమ్ వస్తే ఓకే. లేదంటే.. నరకమే. ఇండస్ట్రీ నుంచి ఒక్కసారి దూరమైతే ఇక వారిని పట్టించుకునే నాథుడే ఉండడు. ప్రస్తుతం ఇలాంటి దీన స్థితిలోనే గ్లామర్ డాల్ నిషా నూర్ ఉంది. స్టార్ హీరోల సరసన నటించింది. ఆ తరువాత దిక్కుతోచని స్థితిలో వ్యభిచార కూపంలోకి అడుగుపెట్టింది. 

ఇంతకీ ఎవరా షా నూర్.. అనుకుంటున్నారా? 1980లో నిషా నూర్‌ తన గ్లామర్‌తో వెండితెరను ఒక ఊపు ఊపేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ గొప్ప స్థాయికి ఎదిగింది. బాలచంద్రన్‌, భారతీరాజా వంటి గొప్ప గొప్ప వారి దర్శకత్వంలో రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి బడా స్టార్స్‌తో కలిసి నటించింది. కానీ ఎవరి హవా అయినా ఎంతకాలం ఉంటుంది? 1995 తర్వాత ఆమె ఫేడ్ అవుట్ అయిపోయింది. 

Noor Shah: స్టార్ హీరోల సరసన నటించిన ఆ హీరోయిన్‌కు ఎయిడ్స్.. ఆమె విషాద కథ తెలిస్తే..

ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. సంపాదించుకున్నదంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. బతకడం కోసం వ్యభిచార కూపంలోకి అడుగు పెట్టింది. నిజానికి ఓ నిర్మాత బలవంతంగా ఆమెను వ్యభిచార కూపంలోకి దింపారట. ఆదుకునే దిక్కులేక ఆ వృత్తిలోనే కొనసాగింది.

కనీసం తలదాచుకునేందుకు ఒక గూడు లేక దర్గా బయట నిద్రించేది. ఓ ఎన్జీవో ఆమెకు ఆరోగ్య పరీక్షలు చేయగా ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. చివరకు నిషా ఎయిడ్స్‌తో పోరాడుతూ 2007లో ఒక అనాథలా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది.

ఇవీ చదవండి:

బన్నీ హీరో ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి వస్తే హీరోని చేసేస్తారా? అన్న అనసూయ..

స్టార్ హీరో విజయ్‌కు ఫైన్.. ఆయన ఏం చేశారంటే ?

మహేష్ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆడేసుకుంటున్నారుగా..

‘నాయకుడు’ పాటకు అందుకే డాన్స్ చేశా: ఏ ఆర్ రెహమాన్

మీతో సినిమా చేయటం ఓ అద్భుతం… నాన్నా: ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్

ప్రీ టీజ‌ర్‌లో ఈ విషయాన్ని గమనించారా ?

 రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ వాయిదా పడనుందా?

Google News