Samantha: మహేష్ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆడేసుకుంటున్నారుగా..

Samantha: మహేష్ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆడేసుకుంటున్నారుగా..

నటీనటుల విషయంలో ఎవరినీ తప్పు పట్టలేం. ఏదైనా సన్నివేశంలో భాగంగా వారు ఏదైనా చేయాల్సి రావొచ్చు. మరీ బరితెగింపుగా ఉంటే మాత్రం ఏమీ చేయలేమనుకోండి. ముఖ్యంగా సామాన్యులం మనం తప్పుబట్టినా పర్వాలేదు కానీ నటీనటులు ఒకరిని ఒకరు తప్పుబట్టుకుంటేనే చూసేందుకు అంత బాగోదు. సినిమాలో ఏదైనా సీన్‌లో కొంచెం ఇబ్బందికరంగా నటించాల్సిన వచ్చినా అదెందుకనేది తోటి వారికి పక్కాగా తెలుస్తుంది.

అలాంటిది.. ఒక నటిని మరో నటి తప్పుబడితే ఎలా ఉంటుంది? పోనీ తప్పుబట్టిన వ్యక్తి లైఫ్‌లో అలాంటి సీన్ చేయరా? అంటే సిట్యువేషన్ డిమాండ్ చేస్తే తప్పదు. ఇదంతా ఎందుకు అంటే.. సమంత(Samantha) ఒకప్పుడు మహేష్ బాబు(Mahesh Babu) సినిమాపై ఇష్టానుసారంగా మాట్లాడింది. ఇప్పుడు తాను కూడా ఓ సీన్‌లో భాగంగా అదే పని చేయాల్సి వచ్చింది. దీంతో ఆమెను మహేష్ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు, కృతిసనన్ జంటగా వన్ నేనొక్కడినే రూపొందిన విషయం తెలిసిందే.

ఈ మూవీలో ‘హలో రాక్ స్టార్’ సాంగ్‌లో మహేష్ బీచ్ లో నడుస్తుంటే, కృతి సనన్ చేతులతో ఆయన అడుగు జాడలను తాకుతుంది. దీనిపై సామ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అబ్బాయి కాళ్ళను అమ్మాయి తాకడం స్త్రీలను అవమానించడమేనని.. ఆడవాళ్లను మగాళ్ల బానిసలన్నట్టుగా చూడటం ఏంటంటూ అప్పట్లో ఫైర్ అయ్యింది.

Samantha: మహేష్ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆడేసుకుంటున్నారుగా..

ఇక ఇప్పుడు ఖుసి మూవీ నుంచి విడుదలైన ఆరాధ్య సాంగ్‌లో విజయ్ దేవరకొండ సోఫాలో పడుకొని ఉండగా సామ్ అతని కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటుంది. మన రౌడీ హీరో తన కాలితో సమంత చేతిని తాకుతూ ఉంటాడు. దీంతో నాడు మహేష్ అడుగు జాడలను కృతి సనన్ టచ్ చేసినందుకే అంత రచ్చ చేశావ్.. ఇవాళ కాలితో తన్నించుకుంటున్నావంటూ మహేష్ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ప్రీ టీజ‌ర్‌లో ఈ విషయాన్ని గమనించారా ?

కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి?

జగన్ చూసిన పవన్ కల్యాణ్ సినిమా ఏంటో తెలుసా?

అతనొక రేపిస్ట్‌లా ఉన్నాడు.. కాపాడాలంటూ యాంకర్ రష్మి ట్వీట్

రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ వాయిదా పడనుందా?

Google News