Gandheevadhari Arjuna: ప్రీ టీజ‌ర్‌లో ఈ విషయాన్ని గమనించారా ?

Gandheevadhari Arjuna: ఈ విషయాన్ని ప్రీ టీజ‌ర్‌లో గమనించారా ?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej).. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు. తనదైన శైలిలో మరోసారి మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాయే ‘గాంఢీవధారి అర్జున’(Gandheevadhari Arjuna). స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు(Praveen Sattaru) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ ప‌క్కా యాక్ష‌న్ మోడ్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకోవ‌టంలో బిజీగా ఉంది. ఆగ‌స్ట్ 25న సినిమాను విడుదల చేస్తున్నారు. 

Gandheevadhari Arjuna: ఈ విషయాన్ని ప్రీ టీజ‌ర్‌లో గమనించారా ?

ఈ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ప్రీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. వ‌రుణ్‌తేజ్ మునుపెన్న‌డూ చేయ‌న‌టువంటి భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఆ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చూస్తుంటే.. మహాభారతంలోని  అర్జునుడి రథంలోని ఆశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా ఉంది. అర్జునుడి ర‌థం, ఓ పాత కారుని ప్రీ టీజ‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. దాన్ని కంటిన్యూ చేస్తూ కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఫ్లాష‌స్ రూపంలో చూపించారు. చివ‌ర‌గా ఓ రైఫిల్ ప‌ట్టుకుని పొగ‌లో ఎంట్రీ ఇస్తారు. ఈ సీన్ క‌చ్చితంగా థియేట‌ర్‌లోని ఆడియెన్స్‌కు ఓ విందులా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. 

Gandheevadhari Arjuna: ఈ విషయాన్ని ప్రీ టీజ‌ర్‌లో గమనించారా ?

ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క‌లిగించేలా రూపొందుతోన్న ఈ యాక్ష న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో సౌండ్‌, విజువ‌ల్స్ ఈ స‌న్నివేశాలు మ‌న‌ల్ని అర్జునుడి ఉన్న యాక్ష‌న్ మోడ్‌లోకి తీసుకెళతాయి. ఈ సినిమాలో డిజైన్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. వ‌రుణ్ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త లుక్‌లో మెప్పించ‌బోతున్నారు. 

Gandheevadhari Arjuna: ఈ విషయాన్ని ప్రీ టీజ‌ర్‌లో గమనించారా ?

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి?

ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

జగన్ చూసిన పవన్ కల్యాణ్ సినిమా ఏంటో తెలుసా?

యాడ్‌లో సితార.. షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందట

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

Google News